హిందువుల పండుగలప్పుడే కాలుష్యం గుర్తుకొస్తుందా?
దిశ, అందోల్: ‘హిందువుల పండుగల సమయాల్లోనే కాలుష్యం గుర్తుకొస్తుందా…? పోలీసులు, ప్రభుత్వ అనుమతితోనే హిందువులు దేవుళ్లను మొక్కే పరిస్థితిని టీఆర్ఎస్ తీసుకొచ్చింది. వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేస్తాం. దమ్ముంటే ఆపాలి’ అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సవాల్ విసిరారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, హిందువులను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గం చౌటకూర్ మండలం శివ్వంపేటకు పాదయాత్ర చేరుకున్న సందర్భంగా.. […]
దిశ, అందోల్: ‘హిందువుల పండుగల సమయాల్లోనే కాలుష్యం గుర్తుకొస్తుందా…? పోలీసులు, ప్రభుత్వ అనుమతితోనే హిందువులు దేవుళ్లను మొక్కే పరిస్థితిని టీఆర్ఎస్ తీసుకొచ్చింది. వినాయక నిమజ్జనం హుస్సేన్ సాగర్‌లోనే చేస్తాం. దమ్ముంటే ఆపాలి’ అని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సవాల్ విసిరారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని, హిందువులను ఇబ్బందులు పెడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా అందోలు నియోజకవర్గం చౌటకూర్ మండలం శివ్వంపేటకు పాదయాత్ర చేరుకున్న సందర్భంగా.. ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వినాయక మండపాల ఏర్పాటుకు అనుమతి తీసుకోవాలని, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, పోలీసులు పరిశీలించి అనుమతులిస్తేనే మండపాలను ఏర్పాటు చేయాలంటూ అంక్షలు విధించడం దారుణమన్నారు. వినాయక నిమజ్జనం చేస్తే హుస్సేన్ సాగర్ కలుషితమవుతుందని కోర్టులో పిటిషన్ వేస్తే, ప్రభుత్వం ఇప్పటివరకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయకపోవడం సిగ్గు చేటన్నారు.
సీఎం కేసీఆరే హిందువుల పండుగలు జరుగకుండా ఇతర వ్యక్తులతో కోర్టులో పిటిషన్ వేయించారని ఆయన ఆరోపించారు. కరోనా పేరుతో హిందువులు జరుపుకునే పండుగ సమయాల్లోనే ప్రభుత్వం కట్టడి చేస్తుందని, లక్ష మందితో సీఎం కేసీఆర్ సభ నిర్వహిస్తే కరోనా వ్యాపించదా? అని ఆయన ప్రశ్నించారు. వినాయక మండపాలపై లేనిపోని అంక్షలు విధిస్తే అనుమతి తీసుకొకుండానే విగ్రహాలను ప్రతిష్టిస్తామని, ఇబ్బందులు కలిగిస్తే మాత్రం ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. శాంతి యుత వాతావారణంలో పండుగలు జరుపుకునేలా పోలీసులు సహకరించాలన్నారు. ఏడేండ్ల కాలంలో వర్షాలు కురిసి పంట, ఆస్తి నష్టం జరిగితే ప్రభుత్వం అదుకునేందుకు ముందుకు రాలేదని, రైతులు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు.