టెస్టులపై కేసీఆర్‌ది మూర్ఖత్వం

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దిశ, న్యూస్‌బ్యూరో : రాష్ట్రంలో కరోనా టెస్టులు నిలిపేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖత్వానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. అన్ని రాష్ట్రాల సీఎంలు కరోనా వైరస్ టెస్టులపై వేగం పెంచితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం.. ఒవైసీ మాటలకు తలొగ్గి టెస్టులు నిలిపేశారన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కరోనా టెస్టులు చేయకుండా రోగుల […]

Update: 2020-04-29 08:34 GMT

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

దిశ, న్యూస్‌బ్యూరో : రాష్ట్రంలో కరోనా టెస్టులు నిలిపేయడం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మూర్ఖత్వానికి నిదర్శనమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. అన్ని రాష్ట్రాల సీఎంలు కరోనా వైరస్ టెస్టులపై వేగం పెంచితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం.. ఒవైసీ మాటలకు తలొగ్గి టెస్టులు నిలిపేశారన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. కరోనా టెస్టులు చేయకుండా రోగుల సంఖ్య తగ్గిందని ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా టెస్టుల సంఖ్య పెంచడంతోనే పాజిటివ్ కేసుల సంఖ్య బయటికి వస్తున్నట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ ఒవైసీ చేతిలో కీలుబొమ్మలా మారారని, రంజాన్ పండగ సందర్భంగా ముస్లిం మైనారిటీలను సంతృప్తి పరిచేందుకే వైరస్ తీవ్రతను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ ప్రయత్నం రాష్ట్ర ప్రజలకు పెను ప్రమాదమని, భవిష్యత్తులో వచ్చే కేసులపై సీఎం బాధ్యత వహించాలని హెచ్చరించారు. ముస్లిం సోదరులకు కరోనా వైరస్‌పై అవగాహన లేకపోవడంతోనే రాష్ట్రంలో ఈ పరిస్థితి దాపురించిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం (కొవిడ్-19) హెల్త్ బులిటెన్‌ తప్పుల తడకగా విడుదల చేస్తోందని, బులిటెన్‌పై వివరణ అడిగినా సమాధానం చెప్పలేని స్థితిలో ఆ శాఖ మంత్రి, అధికారులు ఉన్నారని మండిపడ్డారు. గాంధీ ఆస్పత్రిలో కరోనా నెగిటివ్ వచ్చిన పెషెంట్‌కు నిమ్స్ ఆసుప్రతిలో పాజిటిల్ వచ్చిందని, ఆయనతో పాటు ఆ ఇంట్లో ముగ్గురికి పాజిటిల్ వచ్చిందన్నారు. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వం కరోనా వైరస్ టెస్టులపై ఏపాటి శ్రద్ధ చూపుతుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కరోనా టెస్టులు వేగం చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నియంత్రణ నిబంధనలపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తే ఊరుకునేది లేదని బండి సంజయ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Tags: Bandi Sanjay, Owaisi, Kcr, Corona virus, Positive, Gandhi Hospital

Tags:    

Similar News