అనుమతులిచ్చిన వారిని శిక్షించరా..?

దిశ, న్యూస్‌బ్యూరో: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోపిడీలో నంబర్‌ వన్‌‌గా ఎదిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. సోమవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో నంబర్‌ వన్‌ అని చెప్పుకోవడం సరికాదన్నారు. సాధారణంగా 80 గజాలలోపు నివాస స్థలమున్న పేదలకు ఎలాంటి అనుమతులుండవని, అయితే ప్రస్తుతం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌లో వారిని కూడా చేర్చడం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ అనాలోచిత విధానాలకు నిదర్శనమన్నారు. ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు పేదలు, మధ్య తరగతి […]

Update: 2020-09-07 10:34 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దోపిడీలో నంబర్‌ వన్‌‌గా ఎదిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ విమర్శించారు. సోమవారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో నంబర్‌ వన్‌ అని చెప్పుకోవడం సరికాదన్నారు. సాధారణంగా 80 గజాలలోపు నివాస స్థలమున్న పేదలకు ఎలాంటి అనుమతులుండవని, అయితే ప్రస్తుతం ప్రకటించిన ఎల్‌ఆర్‌ఎస్‌లో వారిని కూడా చేర్చడం సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ అనాలోచిత విధానాలకు నిదర్శనమన్నారు. ప్రస్తుత పరిస్థితిని అధిగమించేందుకు పేదలు, మధ్య తరగతి వారిపై ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీంను బలవంతంగా రుద్దడమేనని విమర్శించారు. గ్రామ పంచాయతీలు, స్థానిక పట్టణ సంస్థలు అనుమతులిచ్చిన లేఅవుట్లు అక్రమమైతే వాటిలోని ప్లాట్లకు అనుమతులు మంజూరు చేసిన వారిని, ప్రభుత్వాలను శిక్షించరా? అని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News