రాంకీ ఛైర్మన్‌ను అరెస్టు చేస్తారా?

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ పారిశ్రామికవాడ పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో ఉన్న విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో గతరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ కెమిస్ట్ అక్కడికక్కడే మరణించగా, నలుగురు గాయపడ్డారు. దీనిపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ ఛైర్మన్‌ను అరెస్ట్ చేసినట్లే రాంకీ ఛైర్మన్‌ను అరెస్ట్ చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రమాద సమయంలో కంపెనీలో ఎంత మంది పని చేస్తున్నారో కూడా కంపెనీ […]

Update: 2020-07-14 06:40 GMT

దిశ, ఏపీ బ్యూరో: వైజాగ్ పారిశ్రామికవాడ పరవాడలోని రాంకీ ఫార్మాసిటీలో ఉన్న విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో గతరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఓ కెమిస్ట్ అక్కడికక్కడే మరణించగా, నలుగురు గాయపడ్డారు. దీనిపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్జీ పాలిమర్స్ ఛైర్మన్‌ను అరెస్ట్ చేసినట్లే రాంకీ ఛైర్మన్‌ను అరెస్ట్ చేస్తారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రమాద సమయంలో కంపెనీలో ఎంత మంది పని చేస్తున్నారో కూడా కంపెనీ యాజమాన్యానికి తెలియదని ఆయన విమర్శించారు. అందుకే ప్రమాదంలో ఎవరూ మరణించలేదని తొలుత చెప్పారని బండారు గుర్తుచేశారు.

కెమిస్ట్‌ కుటుంబం వచ్చి గేటు దగ్గర ధర్నా చేయడంతో వారిని లోపలికి అనుమతించారని, అప్పుడే ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన విషయం బట్టబయలైందని అన్నారు. ఆయన మృతి వార్త కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని ఆయన మండిపడ్డారు. ప్రమాద ప్రాంతంలో హైటెన్షన్ లైన్లు ఉన్నాయని, వీటికి అనుమతి ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. దీనంతటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బండారు సత్యనారాయణ ఆరోపించారు.

Tags:    

Similar News