దేవరగట్టులో కర్రల సమరంపై నిషేధం
దిశ, వెబ్డెస్క్ : దసరా నేపథ్యంలో ప్రతి ఏడాది కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో జరిగే కర్రల సమరంపై నిషేధం విధించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కర్రల సమరం ఉత్సవాన్ని జిల్లా యంత్రాంగం రద్దు చేసింది. దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద దసరా సందర్భంగా.. ఉత్సవ విగ్రహాల కోసం పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అయితే కరోనా కారణంగా దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. […]
దిశ, వెబ్డెస్క్ : దసరా నేపథ్యంలో ప్రతి ఏడాది కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాల్లో జరిగే కర్రల సమరంపై నిషేధం విధించారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది కర్రల సమరం ఉత్సవాన్ని జిల్లా యంత్రాంగం రద్దు చేసింది. దేవరగట్టులో మాళ మల్లేశ్వరస్వామి ఆలయం వద్ద దసరా సందర్భంగా.. ఉత్సవ విగ్రహాల కోసం పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటారు.
అయితే కరోనా కారణంగా దేవరగట్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వీరపాడియన్ హెచ్చరించారు. ఆలూరు, హోళగొంద, హాలహర్వి మండలాల్లో పూర్తి లాక్ డౌన్ విధించారు. మరోవైపు ఏపీ-కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో మద్యం షాపులను బంద్ చేశారు. దేవరగట్టు రాకపోకలకు తిరిగే కేఎస్ ఆర్టీసీ బస్సు సర్వీసులు సోమవారం సాయంత్రం వరకు రద్దు చేసినట్లు వెల్లడించారు.