మోక్ష‌జ్ఞ కోసం కొత్త అవతారమెత్తనున్న బాలయ్య

అయితే ఇప్పుడు సినీ వర్గాల నుంచి వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఓ సోషియో ఫాంట‌సీ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారని తెలుగు సినీ పరిశ్రమంతా కోడై కూస్తుంది. ఆ సినిమా ఏదో కాదు.. బాల‌కృష్ణ సినీ కెరీర్‌లో వ‌న్ ఆప్ ది మైల్ స్టోన్ సినిమా అయిన 'ఆదిత్య 369' కి సీక్వెల్. 'ఆదిత్య 369' సీక్వెల్ గురించి చాలా రోజులు నుంచి రూమర్లు వినిపిస్తున్నాయి. '

Update: 2022-11-09 06:27 GMT

దిశ, వెబ్ డెస్క్ :  నంద‌మూరి అభిమానులు.. వారి అభిమాన హీరోల సినిమాల కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. సినిమాల‌తో పాటు అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న మ‌రో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఇంకోటి ఉంది. అదేంటా అని ఆలోచిస్తున్నారా ? వారి అభిమాన క‌థానాయ‌కుడైన నంద‌మూరి బాల‌కృష్ణ కుమారుడైన నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం. నంద‌మూరి వారసుడి ఎంట్రీ గురించిన వార్త‌లు గ‌త కొన్ని రోజులుగా నెట్టింట పలు వార్తలు, రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.కానీ అధికారికంగా ఐతే ఏ ప్ర‌క‌ట‌న కూడా రావ‌టం లేదు.

అయితే ఇప్పుడు సినీ వర్గాల నుంచి వినిపిస్తోన్న వార్త‌ల మేర‌కు నంద‌మూరి మోక్ష‌జ్ఞ ఓ సోషియో ఫాంట‌సీ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారని తెలుగు సినీ పరిశ్రమంతా కోడై కూస్తుంది. ఆ సినిమా ఏదో కాదు.. బాల‌కృష్ణ సినీ కెరీర్‌లో వ‌న్ ఆప్ ది మైల్ స్టోన్ సినిమా అయిన 'ఆదిత్య 369' కి సీక్వెల్. 'ఆదిత్య 369' సీక్వెల్ గురించి చాలా రోజులు నుంచి రూమర్లు వినిపిస్తున్నాయి. 'ఆదిత్య 999' పేరుతో ఈ సీక్వెల్ రానుందని తెలుస్తుంది. ఈ విషయం బాలకృష్ణ, ద‌ర్శ‌కుడు సింగీతం శ్రీనివాస‌రావు కూడా కొన్ని సంద‌ర్భాల్లో తెలిపారు. 

 అదే కనుక జరిగితే 'ఆదిత్య 999'తో ఓ వైపునంద‌మూరి మోక్ష‌జ్ఞ సినీ ఎంట్రీ.. మరో వైపు డైరెక్టర్‌గా బాలయ్య డెబ్యూ రెండు ఒకేసారి జరుగుతాయన్న మాట. 

ఇవి కూడా చదవండి : క్యాన్సర్ రావడంతో షో నుంచి తొలగించారు.. నటి ఎమోషనల్

Tags:    

Similar News