అనిల్ రావిపూడి కల నిజమైనట్లే!
నటసింహం నందమూరి బాలకృష్ణతో పని చేయాలని.. అనిల్ రావిపూడి దర్శకుడిగా తన కెరియర్ మొదలుపెట్టిన నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్య ‘రామారావు గారు’ పేరుతో అనిల్ బాలయ్యతో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జరిగింది. కారణమేంటో తెలియదు కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే లాక్‌డౌన్‌లో బాలయ్య కోసం మరో కొత్త కథ సిద్ధం చేసిన అనిల్.. మరోసారి లెజెండ్ హీరోను కలిసినట్లు సమాచారం. బాలకృష్ణ స్టామినాకు తగినట్లుగా, అభిమానులు కోరుకునే విధంగా […]
నటసింహం నందమూరి బాలకృష్ణతో పని చేయాలని.. అనిల్ రావిపూడి దర్శకుడిగా తన కెరియర్ మొదలుపెట్టిన నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్య ‘రామారావు గారు’ పేరుతో అనిల్ బాలయ్యతో సినిమా చేస్తాడని ఫిల్మ్ నగర్‌లో ప్రచారం జరిగింది. కారణమేంటో తెలియదు కానీ ఆ సినిమా పట్టాలెక్కలేదు.
అయితే లాక్‌డౌన్‌లో బాలయ్య కోసం మరో కొత్త కథ సిద్ధం చేసిన అనిల్.. మరోసారి లెజెండ్ హీరోను కలిసినట్లు సమాచారం. బాలకృష్ణ స్టామినాకు తగినట్లుగా, అభిమానులు కోరుకునే విధంగా ఉండటంతో బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తుండగా.. ఇది పూర్తికాగానే అనిల్ డైరెక్షన్‌లో సినిమా సెట్స్‌పైకి వెళ్లే చాన్స్ ఉందని సమాచారం.
ఇక అనిల్ రావిపూడి సైతం.. ఈ గ్యాప్‌లో ‘ఎఫ్ 3’ సినిమా పూర్తి చేసే చాన్స్ ఉంది. కానీ విక్టరీ వెంకటేష్ మాత్రం కరోనా పరిస్థితులు నార్మల్ అయ్యాకే సినిమా చేద్దామని చెప్పినట్లుగా టాక్ నడుస్తోంది.