షాకింగ్: షూటింగ్ లో బాలకృష్ణకు గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం బాలయ్య ఆహా ఛానెల్ తో కలిసి ఒక టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ షో కోసం శుక్రవారం అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగిన ప్రోమో షూటింగ్‌లో పాల్గొన్న బాలకృష్ణ కాలుకు గాయం అయినట్లు తెలుస్తోంది. కాలుకు గాయమయ్యి, రక్తం వస్తున్నా బాలయ్య షూట్ ని కంటిన్యూ చేయమని, చిన్న గాయమే కాబట్టి ఎక్కువ కంగారుపడవద్దని యూనిట్ కి తెలిపినట్లు తెలుస్తోంది. గాయంతోనే ప్రోమో […]

Update: 2021-10-09 01:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ణ షూటింగ్ లో గాయపడ్డారు. ప్రస్తుతం బాలయ్య ఆహా ఛానెల్ తో కలిసి ఒక టాక్ షో చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ షో కోసం శుక్రవారం అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగిన ప్రోమో షూటింగ్‌లో పాల్గొన్న బాలకృష్ణ కాలుకు గాయం అయినట్లు తెలుస్తోంది. కాలుకు గాయమయ్యి, రక్తం వస్తున్నా బాలయ్య షూట్ ని కంటిన్యూ చేయమని, చిన్న గాయమే కాబట్టి ఎక్కువ కంగారుపడవద్దని యూనిట్ కి తెలిపినట్లు తెలుస్తోంది. గాయంతోనే ప్రోమో ని కంప్లీట్ చేసి అనంతరం చికిత్స కోసం హాస్పిటల్ కి వెళ్ళారంట బాలకృష్ణ. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బావుందని తెలుస్తోంది. ఇకపోతే ఈ టాక్ షో త్వరలోనే షూటింగ్ చేసుకోబోతుంది. ఈ షో కి వచ్చిన డబ్బును బాలయ్య విరాళంగా ఇవ్వనున్నారు. దీంతో ఆయన అభిమానులు బాలయ్య నిబద్ధతకు, పని పట్ల ఆయనకున్న అంకితభావంకు జోహార్లు అంటూ పొగిడేస్తున్నారు. అంతేకాకుండా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Tags:    

Similar News