సీఎస్ సోమేశ్ కుమార్‌కు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు: బక్క జడ్సన్
దిశ ప్రతినిధి, వరంగల్: ధరణి పోర్టల్ అంశంలో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ నిర్ణయ లోపాలపై.. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించినట్లు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో సోమవారం బక్క జడ్సన్ విలేకరులతో మాట్లాడుతూ.. సాధ్య అసాధ్యాలను గమనించకుండా ధరణి పోర్టల్‌ను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని ఆరోపించారు. ఈ మేరకు ధరణి పోర్టల్ ఫెయిల్యూర్ కారణంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలకు […]
దిశ ప్రతినిధి, వరంగల్: ధరణి పోర్టల్ అంశంలో తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ నిర్ణయ లోపాలపై.. నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించినట్లు కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ తెలిపారు. హనుమకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండలో సోమవారం బక్క జడ్సన్ విలేకరులతో మాట్లాడుతూ.. సాధ్య అసాధ్యాలను గమనించకుండా ధరణి పోర్టల్‌ను తెలంగాణ ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చిందని ఆరోపించారు.
ఈ మేరకు ధరణి పోర్టల్ ఫెయిల్యూర్ కారణంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి ఆత్మహత్యల వెనుక సీఎస్ సోమేశ్ కుమార్ నిర్ణయ లోపం ఉందని పేర్కొంటూ, సీబీఐతో విచారణ చేయించాలని చేసిన విజ్ఞప్తికి ఎన్‌హెచ్‌ఆర్సీ స్పందించిందని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు 4 వారాల్లోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్‌కు నోటీసులు అందినట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మేకల ఉపేందర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆరూరి సాంబయ్య, ఇప్ప శ్రీకాంత్ పాల్గొన్నారు.