దొంగను పట్టించిన కేక్..

దిశ, ఫీచర్స్ : వాషింగ్టన్‌లోని మిల్వాకీ నగరంలో ఉన్న ఓ బేకరీ యజమాని దొంగను పట్టుకునేందుకు కొత్తగా ట్రై చేశాడు. ఏప్రిల్ 19న తన బేకరీలో నగదుతో పాటు కొంత ఎక్విప్‌మెంట్‌ కూడా చోరీకి గురైంది. దీంతో కష్టపడి సంపాదించిన డబ్బు కొట్టేసిన దొంగను ఎలాగైనా పట్టుకుని శిక్ష వేయించాలనుకున్న ఓనర్.. సీసీటీవీ కెమెరా ఆధారంగా దొంగ ఫొటోను సేకరించగలిగాడు. కానీ బ్యాక్ నుంచి మాత్రమే ఫొటో కనిపిస్తుంది. అయినా సరే ఆ పిక్‌ను తమ కుకీస్‌(కేక్)పై […]

Update: 2021-05-18 08:23 GMT

దిశ, ఫీచర్స్ : వాషింగ్టన్‌లోని మిల్వాకీ నగరంలో ఉన్న ఓ బేకరీ యజమాని దొంగను పట్టుకునేందుకు కొత్తగా ట్రై చేశాడు. ఏప్రిల్ 19న తన బేకరీలో నగదుతో పాటు కొంత ఎక్విప్‌మెంట్‌ కూడా చోరీకి గురైంది. దీంతో కష్టపడి సంపాదించిన డబ్బు కొట్టేసిన దొంగను ఎలాగైనా పట్టుకుని శిక్ష వేయించాలనుకున్న ఓనర్.. సీసీటీవీ కెమెరా ఆధారంగా దొంగ ఫొటోను సేకరించగలిగాడు. కానీ బ్యాక్ నుంచి మాత్రమే ఫొటో కనిపిస్తుంది. అయినా సరే ఆ పిక్‌ను తమ కుకీస్‌(కేక్)పై ముద్రించిన ఆయన.. ‘టేక్ ఎ బైట్ అవుట్ ఆఫ్ క్రైమ్’ పేరుతో మే2న స్థానిక ప్రజలకు విక్రయించాడు. మే 1న తమ బేకరీ ఫేస్ బుక్ పేజీల్లో సైతం ఈ విషయాన్ని షేర్ చేయడంతో పాటు క్రైమ్ స్టాపర్స్ సంస్థకు అవసరమైన అన్ని వివరాలను షేర్ చేశారు. ఫైనల్‌గా వారి ప్రయత్నం విజయవంతమైంది. స్థానికులు ఇచ్చిన ఇన్‌ఫర్మేషన్‌తో వారం తరువాత దొంగను పట్టుకున్నారు.

Tags:    

Similar News