ఆర్టీసీ ప్రైవేటీకరణ అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారా?
దిశ, తెలంగాణ బ్యూరో: అప్పుల్లో, నష్టాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరించడమే ప్రభుత్వ సిద్ధాంతమైతే.. అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగా అమ్ముకోవాలని, తర్వాత ఆర్టీసీ గురించి ఆలోచించాలని టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం స్పాట్ పెట్టిందని, అందుకే ఏడేళ్లుగా ఎండీ, చైర్మన్ లేని సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి సజ్జనార్‌ను, చైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ని […]
దిశ, తెలంగాణ బ్యూరో: అప్పుల్లో, నష్టాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరించడమే ప్రభుత్వ సిద్ధాంతమైతే.. అప్పుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుగా అమ్ముకోవాలని, తర్వాత ఆర్టీసీ గురించి ఆలోచించాలని టీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బాబు, రాజిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం స్పాట్ పెట్టిందని, అందుకే ఏడేళ్లుగా ఎండీ, చైర్మన్ లేని సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఐపీఎస్ అధికారి సజ్జనార్‌ను, చైర్మన్‌గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ని నియమించారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రైవేటీకరణ ప్రస్తావనే రాలేదని, ఆంధ్ర పాలకులను విమర్శించే కేసీఆర్ మాత్రం 4 నెలల్లో ప్రైవేటీకరణ అని చైర్మన్‌కు బ్లూప్రింట్ ఇచ్చి ఎలా పంపుతారని నిలదీశారు.
ఆర్టీసీ రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ అని, ఐదేళ్లు పరిపాలన కోసం వచ్చిన కాంట్రాక్ట్ బేసిస్మంత్రివర్గానికి ప్రైవేటీకరించే హక్కు లేదన్నారు. దీనిలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉందని, ఈ విషయాన్ని అసలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారా? లేదా? అని మండిపడ్డారు. 8 గంటలు పనిచేయాల్సిన ఉద్యోగులు, కార్మికులు 16 గంటలు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.