సరికొత్త బైక్ ప్లాటినా-110ను విడుదల చేసిన బజాజ్ ఆటో!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టూ-వీలర్ దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో తన సరికొత్త ప్లాటినా బైకును మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విజయవంతమైన ప్లాటినా-110 మోడల్‌ను కొత్త ఫీచర్లతో పాటు 115 సీసీ ఇంజిన్‌తో కంపెనీ తీసుకొచ్చింది. ఈ బైకులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్) అందిస్తున్నట్టు, ట్యూబ్‌లెస్ టైర్లతో వస్తుందని తెలిపింది. ఈ బైక్ ధరను రూ. 65,920(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ పేర్కొంది. ‘దేశంలోని వివిధ ప్రాంతాలు, రోడ్లపౌ ప్రయాణించేవారికి అనుగుణంగా ఈ బైక్ ఉంటుంది. […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ టూ-వీలర్ దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో తన సరికొత్త ప్లాటినా బైకును మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విజయవంతమైన ప్లాటినా-110 మోడల్‌ను కొత్త ఫీచర్లతో పాటు 115 సీసీ ఇంజిన్‌తో కంపెనీ తీసుకొచ్చింది. ఈ బైకులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్) అందిస్తున్నట్టు, ట్యూబ్‌లెస్ టైర్లతో వస్తుందని తెలిపింది. ఈ బైక్ ధరను రూ. 65,920(ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించినట్టు కంపెనీ పేర్కొంది. ‘దేశంలోని వివిధ ప్రాంతాలు, రోడ్లపౌ ప్రయాణించేవారికి అనుగుణంగా ఈ బైక్ ఉంటుంది. వాహనదారులకు సురక్షితమైన రైడింగ్, బెస్ట్-ఇన్-సెగ్మెంట్ బ్రేకింగ్ టెక్నాలజీ అప్‌గ్రేడ్ అనుభవాన్ని పొందుతారని’ బజాజ్ ఆటో దేశీయ మోటార్‌సైకిల్ బిజినెస్ యూనిట్ అధ్యక్షుడు సారంగ్ కనడే ఓ ప్రకటనలో చెప్పారు. తమ ప్లాటినా బైక్ ఇప్పటికే 70 లక్షల మంది వినియోగదారులను సంపాదించిందని, ఈ కొత్త బైక్ ఏబీఎస్‌తో రానుండటంతో మరింత మంది ఆదరణ దక్కించుకుంటుందనే నమ్మకం ఉందని ఆయన వెల్లడించారు.