ఏప్రిల్ జీతాలను పూర్తిగా ఇస్తాం : బజాజ్ ఆటో!

దిశ, వెబ్‌డెస్క్: ఏప్రిల్ నెలకు సంబంధించి వేతనాలను పూర్తిగా చెల్లిస్తామని, కాంట్రాక్టు కార్మికులకుతో సహా తమ సిబ్బందికి జీతంలో ఎలాంటి కోత విధించమని ఆటో దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో పేర్కొంది. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులకు 10 శాతం కోత విధించాలని గతంలో బజాజ్ ఆటో నిర్ణయించింది. దీన్ని మార్చుకుంటున్నామని, ప్రతి ఉద్యోగికీ వేతనాన్ని అందిస్తామని ఈ-మెయిల్ ద్వారా తెలిపింది. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సమాజానికి చేసే సాయంలో భాగంగా సంస్థ సొంత సిబ్బందికి ఎటువంటి […]

Update: 2020-05-04 03:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏప్రిల్ నెలకు సంబంధించి వేతనాలను పూర్తిగా చెల్లిస్తామని, కాంట్రాక్టు కార్మికులకుతో సహా తమ సిబ్బందికి జీతంలో ఎలాంటి కోత విధించమని ఆటో దిగ్గజ సంస్థ బజాజ్ ఆటో పేర్కొంది. కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో ఉద్యోగులకు 10 శాతం కోత విధించాలని గతంలో బజాజ్ ఆటో నిర్ణయించింది. దీన్ని మార్చుకుంటున్నామని, ప్రతి ఉద్యోగికీ వేతనాన్ని అందిస్తామని ఈ-మెయిల్ ద్వారా తెలిపింది. లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సమాజానికి చేసే సాయంలో భాగంగా సంస్థ సొంత సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడటమే ప్రధానమని భావిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. ‘సంస్థ బిజినెస్‌లో ప్రతీ ఉద్యోగి భాగస్వామిగానే ఉంటారు. ముందు సమాజానికి సాయం చేయడానికంటే సొంత కుటుంబ సభ్యులను భద్రంగా చూసుకోవడం ముఖ్యమని భావిస్తున్నాం. కాంట్రాక్టు కార్మికుల పీలలెవరూ కూడా ఆకలితో దుఃఖించకూడదు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్ నెల జీతాలను పూర్తిగా ఇవ్వాలని నిర్ణయించాం. మే నలకు సంబంధించి నెల చివరిలో పరిస్థితిని సమీక్షించి, తర్వాతి నిర్ణయం తెసుకుంటామని సంస్థ వివరించింది.

Tags: Wages, Covid-19, Salary Cut, Lockdown, Coronavirus, Bajaj Auto

Tags:    

Similar News