ఢిల్లీ అల్లర్ల కేసు.. ఉమర్ ఖలీద్‌కు బెయిల్

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్‌కు ఢిల్లీ అల్లర్ల కేసులో బెయిల్ లభించింది. గతేడాది ఫిబ్రవరిలో ఖజురీ కాస్ ఏరియాలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరుచేసింది. ఖలీద్‌పై అభియోగాల్లో తయారుచేసినట్టుగా ఉన్నాయనీ, సాక్షి కూడా ఊకదంపుడుగా మాట్లాడారని అదనపు సెషన్స్ జడ్జీ వినోద్ యాదవ్ అన్నారు. అసమ్మతిదారుల గొంతునొక్కే ప్రభుత్వ కుట్రలో భాగంగానే దర్యాప్తు ఏజెన్సీలు ఉమర్ ఖలీద్‌ను ఈ కేసులో ఇరికించాయని ఆయన తరఫు […]

Update: 2021-04-15 10:01 GMT
JNU student Umar Khalid
  • whatsapp icon

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి ఉమర్ ఖలీద్‌కు ఢిల్లీ అల్లర్ల కేసులో బెయిల్ లభించింది. గతేడాది ఫిబ్రవరిలో ఖజురీ కాస్ ఏరియాలో జరిగిన అల్లర్లకు సంబంధించిన కేసులో స్థానిక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరుచేసింది. ఖలీద్‌పై అభియోగాల్లో తయారుచేసినట్టుగా ఉన్నాయనీ, సాక్షి కూడా ఊకదంపుడుగా మాట్లాడారని అదనపు సెషన్స్ జడ్జీ వినోద్ యాదవ్ అన్నారు. అసమ్మతిదారుల గొంతునొక్కే ప్రభుత్వ కుట్రలో భాగంగానే దర్యాప్తు ఏజెన్సీలు ఉమర్ ఖలీద్‌ను ఈ కేసులో ఇరికించాయని ఆయన తరఫు న్యాయవాది త్రిదీప్ వాదించారు. అయితే, ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన ఉపా కేసులో నిందితుడిగా ఉండటంతో ఖలీద్ జైలు నుంచి విడుదల కావడం లేదు.

Tags:    

Similar News