దళిత బంధుకు పోటీగా బహుజన విద్యార్థుల యాత్ర
దిశ, తెలంగాణ బ్యూరో: దళితబంధుకు పోటీగా బహుజన విద్యార్థి సంఘాలు యాత్రలను ప్రారంభిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా హుజురాబాద్‌లో నిరుద్యోగ ప్రజాచైతన్య యాత్ర చేపట్టనున్నారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేపట్టి నిరుద్యోగులను చైతన్య పరచనున్నారు. ఆర్ఎస్ ప్రవీణ కుమార్‌తో సంప్రదింపులు చేపట్టి బీఎస్పీకి మద్దతుగా ఈ యాత్రను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం యాత్ర షెడ్యూల్ ప్రకటించనున్నారు. టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యం.. వందలాది మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన టీఆర్ఎస్ పార్టీని […]
దిశ, తెలంగాణ బ్యూరో: దళితబంధుకు పోటీగా బహుజన విద్యార్థి సంఘాలు యాత్రలను ప్రారంభిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా హుజురాబాద్‌లో నిరుద్యోగ ప్రజాచైతన్య యాత్ర చేపట్టనున్నారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేపట్టి నిరుద్యోగులను చైతన్య పరచనున్నారు. ఆర్ఎస్ ప్రవీణ కుమార్‌తో సంప్రదింపులు చేపట్టి బీఎస్పీకి మద్దతుగా ఈ యాత్రను కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హుజూరాబాద్ ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం యాత్ర షెడ్యూల్ ప్రకటించనున్నారు.
టీఆర్ఎస్‌ను ఓడించడమే లక్ష్యం..
వందలాది మంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన టీఆర్ఎస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా నిరుద్యోగ ప్రజాచైతన్య యాత్ర కొనసాగుతుంది. దళితబంధు పథకంతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడుతున్న నాటకాలను ప్రజలముందు ఉంచుతాము. ఇప్పటి వరకు ఎస్సీ కమీషన్‌ను నియమించలేని ప్రభుత్వం దళితులను మోసం చేసేలా పథకాలు ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా యువతను చైతన్య పరిచేలా ఇంటింటికి ప్రచారం చేస్తాం. -బహుజన విద్యార్థి సంఘాల అధ్యక్షుడు వేల్పుల సంజయ్