JD Laxmi Narayana : కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై సీబీఐ మాజీ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి కేటీఆర్(KTR) కు ఏసీబీ(ACB) ఇచ్చిన నోటీసులపై సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ(JD Laxmi Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2025-01-08 14:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి కేటీఆర్(KTR) కు ఏసీబీ(ACB) ఇచ్చిన నోటీసులపై సీబీఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ(JD Laxmi Narayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ జారీ చేసిన నోటీసుల్లో ఎలాంటి స్పష్టత లేదని, అవి నోటీసుల్లా కాకుండా లేఖలా ఉన్నాయని పేర్కొన్నారు. ఆ నోటీసును తాను పరిశీలించానని.. ఏదైనా విచారణ ఏజెన్సీ నోటీసులు ఇచ్చినప్పుడు ఏ సెక్షన్ కింద ఇస్తున్నారో పేర్కొంటారని, కానీ కేటీఆర్ కు ఇచ్చిన నోటీసులో అవి లేవన్నారు. ఏదైనా డాక్యుమెంట్ తీసుకోవాలంటే ఆయనకు 94 BNSS (91 CrPC) కింద నోటీసు ఇవ్వాలి కానీ ఇక్కడ అవేమీ ఇవ్వలేదని తెలియజేశారు. కేటీఆర్ కు ఏసీబీ 160 CrPC (ప్రస్తుతం 179 BNS) కింద నోటీసు ఇచ్చారని, అయితే ఒక కేసు విషయంలో సంబంధం ఉన్న వ్యక్తులను పిలిపించాలంటే 179 బీఎన్ఎస్ కింద నోటీసులు ఇవ్వాలని పేర్కొన్నారు. కేటీఆర్ ప్రస్తుతం ఎఫ్‌ఐఆర్‌ లో నిందితుడు మాత్రమే అని, ఎఫ్‌ఐఆర్‌ లో పేరు ఉన్న నిందితుడికి 160 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వరాదన్నారు.

Tags:    

Similar News