Miss World Pageant: మిస్‌ వరల్డ్‌ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

మిస్ వరల్డ్ పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

Update: 2025-04-29 09:33 GMT
Miss World Pageant: మిస్‌ వరల్డ్‌ ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మిస్ వరల్డ్ -2025 పోటీలకు (Miss World Contest-2025) అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టిసిపెంట్స్ కు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మిస్ వరల్డ్ -2025 ఏర్పాట్లపై ఇవాళ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమీక్ష నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, వేం నరేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు, తదితరులు హాజరైన ఈ సమీక్షలో.. మే 10 న ప్రారంభం కానున్న మిస్ వరల్డ్-2025 అందాల పోటీకి సంబంధించి ఏర్పాట్ల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఎయిర్ పోర్టు, అతిథులు బస చేసే హోటల్, కార్యక్రమాలు జరిగే చోట కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయాలని, తెలంగాణలో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్న ఆదేశించారు. విభాగాలవారీగా ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. నగరంలో పెండింగ్ లో ఉన్న బ్యూటిఫికేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పోటీలు నాటి నుంచి పూర్తయ్యే వరకు చేపట్టే కార్యక్రమాలు, ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు. 

Tags:    

Similar News