బద్వేలు బరిలో 15 మంది అభ్యర్థులు
దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ ఉపఎన్నికకు 18 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వారిలో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మెుత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. బైపోల్‌కు 27 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఈనెల 11న జరిగిన నామినేషన్ల స్క్రూటినీలో 9మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అనంతరం 18 మంది […]
దిశ, ఏపీ బ్యూరో : వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు ఉపఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ ఉపఎన్నికకు 18 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వారిలో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మెుత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు. బైపోల్‌కు 27 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఈనెల 11న జరిగిన నామినేషన్ల స్క్రూటినీలో 9మంది నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. అనంతరం 18 మంది బరిలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.
బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ముగ్గురు స్వతంత్రులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు మెుత్తం 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇకపోతే ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధారణ ఎన్నికల పరిశీలకులు భీష్మాకుమార్ ఇప్పటికే కడప జిల్లా చేరుకున్నారు. బుధవారం పోలింగ్ నిర్వహణపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నిక నిర్వహణ జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.