భద్రాచలం పోలీసుల స్మార్ట్ వర్క్.. రూ.8 లక్షల బంగారం సేఫ్
దిశ, భద్రాచలం అర్బన్ : ఓ దంపతులు ప్రయాణంలో పోగొట్టుకున్న లక్షల ఖరీదైన బంగారు, వెండి ఆభరణాలను కనుగొని వారికి అప్పగించి భద్రాచలం పోలీసులు శభాష్ అనిపించకున్నారు. మణుగూరుకు చెందిన ప్రభాకర్‌రావు, భాగ్యలక్ష్మి దంపతులు కాకినాడ వెళ్ళేందుకు మణుగూరు నుంచి భద్రాచలం వరకు టాటా మ్యాజిక్ వాహనంలో వచ్చారు. ఆదమరిచి తమ లగేజి సూట్కేసును వాహనంలోనే మర్చిపోయారు. అందులో సుమారు 15 తులాలు బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. కొంతసేపటి తర్వాత వాహనంలో సూట్‌కేసు మర్చిపోయిన విషయాన్ని […]
దిశ, భద్రాచలం అర్బన్ : ఓ దంపతులు ప్రయాణంలో పోగొట్టుకున్న లక్షల ఖరీదైన బంగారు, వెండి ఆభరణాలను కనుగొని వారికి అప్పగించి భద్రాచలం పోలీసులు శభాష్ అనిపించకున్నారు. మణుగూరుకు చెందిన ప్రభాకర్‌రావు, భాగ్యలక్ష్మి దంపతులు కాకినాడ వెళ్ళేందుకు మణుగూరు నుంచి భద్రాచలం వరకు టాటా మ్యాజిక్ వాహనంలో వచ్చారు. ఆదమరిచి తమ లగేజి సూట్కేసును వాహనంలోనే మర్చిపోయారు. అందులో సుమారు 15 తులాలు బంగారు, వెండి ఆభరణాలు ఉన్నాయి. కొంతసేపటి తర్వాత వాహనంలో సూట్‌కేసు మర్చిపోయిన విషయాన్ని గమనించి భద్రాచలం టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
వెంటనే స్పందించిన సీఐ స్వామి ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు పర్యవేక్షించే కానిస్టేబుల్ శంకర్ నిశితంగా అన్ని సీసీ కెమెరాలు పరిశీలించి, ఆ దంపతులు ప్రయాణించిన టాటా మ్యాజిక్ వాహనం భద్రాచలం వెంకటేశ్వర కాలనీలో గుర్తించి అక్కడికి వెళ్ళి లగేజీ సూట్కేసును స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న సుమారు రూ.8 లక్షల విలువ గల నగలను సీఐ స్వామి చేతుల మీదుగా ఆ దంపతులు అందుకున్నారు. పోగొట్టుకున్న వస్తువులను క్షణాల్లో వెతికి తిరిగి ఇచ్చిన భద్రాచలం పోలీసులకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా భద్రాచలం సీఐ స్వామి, కానిస్టేబుల్ శంకర్, ఇతర సిబ్బందిని పలువురు అభినందించారు.