ఎస్‌బీఐ లోగో వెనక అర్థం తెలుసా?
మీకు తెలిసిన కొన్ని బ్యాంకుల పేర్లు చెప్పండి అనగానే మొదట గుర్తొచ్చే పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సింపుల్‌గా ఎస్‌బీఐ అంటాం. కేవలం పేరు మాత్రమే కాదు, ఆ బ్యాంకు లోగో కూడా కళ్లముందు కనిపించినట్లు అనిపిస్తుంది. దేశంలో ఎస్‌బీఐలో కనీసం ఒక్క ఖాతా కూడా లేని కుటుంబం ఉండదు అనడం అతిశయోక్తికాదేమో. 1955 నుంచి సేవలు అందిస్తున్న ఈ బ్యాంకు విశ్వాసానికి మారుపేరుగా మారింది. కానీ, ఆ బ్యాంకు లోగో […]
మీకు తెలిసిన కొన్ని బ్యాంకుల పేర్లు చెప్పండి అనగానే మొదట గుర్తొచ్చే పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సింపుల్‌గా ఎస్‌బీఐ అంటాం. కేవలం పేరు మాత్రమే కాదు, ఆ బ్యాంకు లోగో కూడా కళ్లముందు కనిపించినట్లు అనిపిస్తుంది. దేశంలో ఎస్‌బీఐలో కనీసం ఒక్క ఖాతా కూడా లేని కుటుంబం ఉండదు అనడం అతిశయోక్తికాదేమో. 1955 నుంచి సేవలు అందిస్తున్న ఈ బ్యాంకు విశ్వాసానికి మారుపేరుగా మారింది. కానీ, ఆ బ్యాంకు లోగో డిజైన్ వెనక వివరం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక ఆలస్యం ఎందుకు అది కూడా తెలుసుకుంటే ఒక పని అయిపోతుంది.
నీలిరంగు వృత్తం, మధ్యలో తెలుపురంగు గుర్తు ఉన్న ఈ ఎస్‌బీఐ లోగో డిజైన్‌కి సంబంధించి మూడు ప్రధాన వివరణలు ఉన్నాయి.
నీలిరంగు భాగం మొత్తం సంతృప్తికర ఐకమత్యానికి చిహ్నం కాగా, మధ్యలో ఉన్న గుర్తు ఒక సాధారణ మనిషిని సూచిస్తోందనేది మొదటి వివరణ. మధ్యలో ఉన్న గుర్తు తాళం చెవి దూర్చే రంధ్రం అని, అది బ్యాంకులోని డబ్బు రక్షణకు గుర్తు అని రెండో వివరణ చెబుతోంది. ఇక ఇదేది కాదు గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్‌లోని కంకారియా సరస్సు పై భాగాన్ని చూసి ఈ లోగో డిజైన్ చేశారని మూడో వివరణ ప్రచారంలో ఉంది.
అయితే ఈ లోగో డిజైన్ చేసిన శేఖర్ కామత్ మాత్రం మూడో వివరణ తప్పు అంటారు. లోగో డిజైన్‌కి కంకారియా సరస్సుకి ఎలాంటి సంబంధం లేదని తన కోరా పేజీలో సమాధానం ఇచ్చారు. అప్పట్లో బ్యాంకులో లావాదేవీల కోసం ఇచ్చే టోకెన్ ఆకృతిలో దాన్ని సింపుల్ డిజైన్ చేశానని, అందులో నీలి రంగు ఆకాశానికి గుర్తు అని, ఆకారం రక్షణకు బలానికి గుర్తు అని ఆయన వివరించారు.