హైదరాబాద్‌లో రూ.45 వేలకు శిశువు విక్రయం
దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో శిశువును విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా తల్లి బిడ్డను విక్రయించగా, కొనుగోలు చేసిన వారు సైతం మరొకరికి విక్రయించం నగరంలో సంచలనంగా మారింది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నాంపల్లి సుభాన్‌పురాకు చెందిన అబ్దుల్ ముజాహిద్ (29) బార్ అండ్ రెస్టారెంట్ లో మేనేజర్ గా పనిచేస్తాడు. ఈయనకు […]
దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లో శిశువును విక్రయించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా తల్లి బిడ్డను విక్రయించగా, కొనుగోలు చేసిన వారు సైతం మరొకరికి విక్రయించం నగరంలో సంచలనంగా మారింది. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.
నాంపల్లి సుభాన్‌పురాకు చెందిన అబ్దుల్ ముజాహిద్ (29) బార్ అండ్ రెస్టారెంట్ లో మేనేజర్ గా పనిచేస్తాడు. ఈయనకు ఏడాదిన్నర క్రితం అబ్దుల్ జోయాఖాన్ ను ప్రేమ వివాహాం చేసుకున్నాడు. వీరికి షేక్ అద్నాన్ అనే 2 నెలల బాలుడు ఉన్నాడు. గత రెండు నెలలుగా నాంపల్లి సుభాన్ పురాలో అద్దెకు నివాసిస్తున్నారు. ఈ నెల 3వ తేదీన అబ్దుల్ ముజాహిద్ భార్యతో గొడవ పడి ఎంఎస్ మక్తాలోని సొంతింటికి వెళ్ళిపోయాడు. అతను ఇంటి నుంచి వెళ్ళే సమయంలో అతని కొడుకు భార్యతో పాటే ఉన్నాడు. అనంతరం ఈ నెల 8న సాయంత్రం 6:30 గంటలకు నాంపల్లి సుభాన్పురాలోని అద్దె ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో కుమారుడు కన్పించకపోయే సరికి భార్యను అడుగగా.. అఘాపురాకు చెందిన షేక్ మహమ్మద్, తబుస్సం బేగం దంపతులకు రూ.45 వేలకు అమ్మినట్లు తెలిపింది. దీంతో భర్త ముజాహిద్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
వెంటనే మొబైల్ ఫోన్ ద్వారా అఘాపురాకు చెందిన షేక్ మహమ్మద్‌ను సంప్రదించగా, కుమారుడిని అప్పగిస్తామని చెప్పారు. కానీ, అతను అఘాపురాకు వెళ్లాకా.. కాలాపత్తర్ కు చెందిన మరో వ్యక్తికి అమ్మినట్టు చెప్పారు. దీంతో ముజాహిద్ తన కుమారుడి విక్రయం గురించి హబీబ్ నగర్ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ బి.జయంత్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి, శిశువును కొనుగోలు చేసిన వారిని అదుపులోకి తీసుకుని, బాబును తండ్రికి అప్పగించారు.