మా సహనాన్ని చేతగానితనంగా భావించొద్దు.. వారికి బాబు స్ట్రాంగ్ వార్నింగ్
దిశ, ఏపీ బ్యూరో: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. విధ్వంసం సృష్టించి ఎన్నిక వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఎన్నిక నిర్వహించడం చేతగాకపోతే ఎస్ఈసీ, డీజీపీ పదవులనుంచి తప్పుకోవాలి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికను అడ్డుకునే బదులు అధికారపార్టీ వారిని చైర్మన్‌గా నియమించుకోండి. భయభ్రాంతులకు గురిచేసి టీడీపీ సభ్యులను లోబర్చుకోవాలని చూస్తున్నారు. […]
దిశ, ఏపీ బ్యూరో: కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. విధ్వంసం సృష్టించి ఎన్నిక వాయిదా వేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఎన్నిక నిర్వహించడం చేతగాకపోతే ఎస్ఈసీ, డీజీపీ పదవులనుంచి తప్పుకోవాలి అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికను అడ్డుకునే బదులు అధికారపార్టీ వారిని చైర్మన్‌గా నియమించుకోండి.
భయభ్రాంతులకు గురిచేసి టీడీపీ సభ్యులను లోబర్చుకోవాలని చూస్తున్నారు. మారణాయుధాలతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి హల్ చల్ చేస్తున్నా పోలీసులు గుడ్లప్పగించి చూస్తున్నారు. విజయవాడ ఎంపీ కేశినేని నానితో సహా టీడీపీ సభ్యులు క్రమశిక్షణ, ఓర్పుతో వ్యవహరిస్తున్నారు. మా సహనాన్ని చేతగానితనంగా పరిగణించొద్దు. కొండపల్లి చైర్మన్ ఎన్నిక నిర్వహించి ప్రజాస్వామ్య విలువలను కాపాడండి అంటూ అధికారులకు చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.