రూ. వంద మాత్రమే ఇస్తున్నారు: అయ్యన్న పాత్రుడు

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడంలేదన్నారు. లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 8 వేల కోట్లను ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. క్వారంటైన్ లో ఉన్నవారికి మెమో ప్రకారం భోజనం పెడుతున్నారా అని ప్రశ్నించారు. క్వారంటైన్ నుంచి ఇంటికి వెళ్లే కరోనా రోగులకు […]

Update: 2020-07-18 00:38 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయని, కానీ, రాష్ట్ర ప్రభుత్వం సరైన రీతిలో స్పందించడంలేదన్నారు. లాక్ డౌన్ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 8 వేల కోట్లను ఎక్కడ ఖర్చు పెట్టారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. క్వారంటైన్ లో ఉన్నవారికి మెమో ప్రకారం భోజనం పెడుతున్నారా అని ప్రశ్నించారు. క్వారంటైన్ నుంచి ఇంటికి వెళ్లే కరోనా రోగులకు రూ. 2 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని, వారికి వంద మాత్రమే ఇస్తున్నారు.. మిగతా రూ. 1,900 ఏం చేస్తున్నట్లు? అని అయన్నపాత్రుడు ప్రశ్నించారు. నర్సీపట్నం, అనకాపల్లి, విశాఖ ఆసుపత్రులలో కరోనా టెస్టింగ్ కిట్లు లేవన్నారు.

Tags:    

Similar News