కేంద్రం నిర్ణయంతో శివసేన హర్షం

            అయోధ్య విషయంలో కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని శివసేన తెలిపింది. శ్రీరాముడి ఆలయ నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై శివసేన హర్షం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ లోక్‌సభలో చేసిన ప్రకటనను మంచి పరిణామనన్నారు. శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే తరపున పార్లమెంటు వద్ద ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రావత్ మీడియాతో మాట్లాడారు. ‘‘మహారాష్ట్ర ముఖ్యమంత్రి […]

Update: 2020-02-05 03:59 GMT

యోధ్య విషయంలో కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని శివసేన తెలిపింది. శ్రీరాముడి ఆలయ నిర్మాణం కోసం ట్రస్టును ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై శివసేన హర్షం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇవాళ లోక్‌సభలో చేసిన ప్రకటనను మంచి పరిణామనన్నారు. శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే తరపున పార్లమెంటు వద్ద ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రావత్ మీడియాతో మాట్లాడారు. ‘‘మహారాష్ట్ర ముఖ్యమంత్రి తరపున ప్రధానమంత్రి ప్రకటనను స్వాగతిస్తున్నాను. అయితే రామ మందిరం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నది సుప్రీంకోర్టు అన్న విషయం మీ అందరికి తెలుసు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని గౌరవించడం ప్రభుత్వం బాధ్యత..’’ అని సంజయ్ రావత్ పేర్కొన్నారు.

Tags:    

Similar News