ఖాతాదారులకు యాక్సిస్ బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్!
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ దిగ్గజ యాక్సిస్ బ్యాంక్ తన ఏఎస్ఏపీ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఖాతా కలిగిన వినియోగదారులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్‌లలో షాపింగ్ చేయడం ద్వారా 10-15 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చని వెల్లడించింది. దీంతో పాటు 30 కంటే ఎక్కువ బ్రాండ్ ఉత్పత్తులపై 45 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్యాష్‌బ్యాక్ కోసం యాక్సిస్ బ్యాంక్ ఏఎస్ఏపీ […]
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రైవేట్ దిగ్గజ యాక్సిస్ బ్యాంక్ తన ఏఎస్ఏపీ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఖాతా కలిగిన వినియోగదారులు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్‌లలో షాపింగ్ చేయడం ద్వారా 10-15 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చని వెల్లడించింది. దీంతో పాటు 30 కంటే ఎక్కువ బ్రాండ్ ఉత్పత్తులపై 45 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ఇస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్యాష్‌బ్యాక్ కోసం యాక్సిస్ బ్యాంక్ ఏఎస్ఏపీ డిజిటల్ సేవింగ్స్ ఖాతా ఉన్నవారు బ్యాంకు ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ ‘గ్రాబ్ డీల్స్’ నుంచి పొందే వీలుంటుందని పేర్కొంది.
యాక్సిస్ బ్యాంక్ ఏఎస్ఏపీ డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ల విభాగంలో ఈజీ, ప్రైమ్, ప్రయరిటీ, బుర్గుండి లాంటి నాలుగు రకాల ఖాతాలు ప్రారంభించింది. ఈ ఖాతాలను వీడియో కేవైసీ, బ్యాంకు వెబ్‌సైట్, యాప్ ద్వారా సులభంగా తెరిచే వీలుంటుందని వివరించింది. వీటి ద్వారా వినియోగదారులు 10-15 శాతం మధ్య క్యాష్‌బ్యాక్ ఆఫర్లను పొందుతారని తెలిపింది. ఈ ఆఫర్ నవంబర్ చివరి వరకు అందుబాటులొ ఉంటుందని పేర్కొంది. అయితే, ఈ ఆఫర్ ఆరు నెలల పాటు ఏఎస్ఏపీ డిజిటల్ సేవింగ్స్ ఖాతాలను వినియోగిస్తున్న వారికి వర్తిస్తుందని బ్యాంకు స్పష్టం చేసింది.