పెనుమత్స లేనందుకు బాధేస్తోంది: జగన్

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు. సాంబశివరాజు మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. గత ఎన్నికల్లో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా.. మాజీ మంత్రిగా.. ప్రొటెం స్పీకర్‌గా పెన్మత్స సాంబశివరాజు ఎన్నో పదవులు చేపట్టారని ముత్తంశెట్టి కొనియాడారు. ప్రజలకు […]

Update: 2020-08-10 01:27 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు సంతాపం వ్యక్తం చేశారు. సాంబశివరాజు మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యానన్నారు. గత ఎన్నికల్లో పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆయన మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా.. మాజీ మంత్రిగా.. ప్రొటెం స్పీకర్‌గా పెన్మత్స సాంబశివరాజు ఎన్నో పదవులు చేపట్టారని ముత్తంశెట్టి కొనియాడారు. ప్రజలకు సేవలందించిన నాయకుడిని కోల్పోవడం.. పార్టీకి తీరని లోటన్నారు. పెనుమత్స కుటుంబ సభ్యులకు ముత్తంశెట్టి ప్రగాఢ సానుభూతిని వారు తెలిపారు.

Tags:    

Similar News