అమ్మకాల్లేవ్..ఆదుకోండి!
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలోని వాహన తయారీదారులు కార్లు, ట్రక్కులు, మోటారుబైకులపై తాత్కాలికంగా పన్ను తగ్గింపుతో పాటు పాత వాహనాలను తొలగించేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. కొవిడ్-19 వ్యాప్తి ఆర్థిక వ్యవస్థకు ఆటంకంగా మారడంతో అమ్మకాలు పెంచేందుకు, ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తయారీదారులు తెలిపారు. ఇండియాలో ప్రయాణీకుల వాహనా అమ్మకాలు ఈ ఏడాది మార్చి నాటికి 18 శాతం పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే దేశంలో ఆర్థిక వృద్ధి బలహీనమైన తర్వాత రికార్డు స్థాయిలో అమ్మకాలు పడిపోయాయి. కరోనాను […]
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలోని వాహన తయారీదారులు కార్లు, ట్రక్కులు, మోటారుబైకులపై తాత్కాలికంగా పన్ను తగ్గింపుతో పాటు పాత వాహనాలను తొలగించేందుకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కోరారు. కొవిడ్-19 వ్యాప్తి ఆర్థిక వ్యవస్థకు ఆటంకంగా మారడంతో అమ్మకాలు పెంచేందుకు, ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తయారీదారులు తెలిపారు.
ఇండియాలో ప్రయాణీకుల వాహనా అమ్మకాలు ఈ ఏడాది మార్చి నాటికి 18 శాతం పడిపోయాయి. గత ఏడాదితో పోలిస్తే దేశంలో ఆర్థిక వృద్ధి బలహీనమైన తర్వాత రికార్డు స్థాయిలో అమ్మకాలు పడిపోయాయి. కరోనాను అరికట్టేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్ విధించడంతో ఇది మరింత దిగజారింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చర్(ఎస్ఐఏఎమ్)లో ఉన్న మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి దేశీయ కంపెనీలు, అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థలు వోక్స్‌వ్యాగన్, టయోటా కంపెనీలు ప్రభుత్వాన్ని పన్నుల, ప్రోత్సాహకాలివ్వాలని అభ్యర్థించాయి. అన్నిరకాల ఆటోమొబైల్ పరికరాలు, విడిభాగాల అమ్మకాలపై పన్ను తగ్గించాలంటూ కంపెనీలు కోరుతున్నాయని ఎస్ఐఏఎమ్ వెల్లడించింది.
కంపెనీలు అన్ని రకాల పరికరాలు, విడిభాగాల అమ్మకాలపై 10 శాతం తాత్కాలిక పన్ను తగ్గింపు ఇవ్వాలని కోరినట్టు ఎస్ఐఏఎమ్ స్పష్టం చేసింది. 10 శాతం పన్ను తగ్గింపు తాత్కాలికం అంటే ఎంతకాలమనేది కంపెనీలు స్పష్టత ఇవ్వలేదు. ఆటోమొబైల్ పరిశ్రమ ఇండియాలోని ఉత్పాదక రంగానికి వెన్నెముక లాంటిది, అత్యధికంగా ఉపాధిని కల్పిస్తూ దేశానికి ఆర్థిక సహకారాన్ని అందిస్తోందని ఎస్ఐఏఎమ్ వివరించింది. కరోనా వైరస్ వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్న ఈ పరిశ్రమకు సహకారం అందించాలని అసోసియేషన్ పేర్కొంది. మిగిలిన రంగాలతో సహా ఆటో పరిశ్రమ పూర్తీగా నిలిచిపోయింది. మార్చి చివరి నుంచి కార్ల షోరూమ్‌లన్నీ మూతబడ్డాయి. లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించడంతో సంస్థల మూలధన నిల్వలు తగ్గిపోతున్నాయని తెలిపాయి. ఇప్పటికే వాహనాల అమ్మకాలు 18 శాతం క్షీణించగా, లాక్‌డౌన్ పొడిగింపు వల్ల డీలర్‌షిప్ అమ్మకాలు 10 నుంచి 12 శాతం తగ్గే అవకాశముందని అసోసియేషన్ అంచనా వేస్తోంది.
Tags: Indian Car Companies, Indian Car Making Fims, Auto Sector, Impact Of Coronavirus On Indian Auto Industry, Impact Of Coronavirus On Auto Sector, SIAM, Car Companies, Automakers