పెరగనున్న నిస్సాన్ కార్ల ధరలు
దిశ, వెబ్‌డెస్క్ : ఏప్రిల్ నుంచి కార్ల ధరలను పెంచనున్నట్టు దేశీయంగ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కంపెనీ నిస్సాన్ ఇండియా కూడా వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. ధరల పెంపు అన్ని రకాల కార్లకు వర్తిస్తుందని, ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిన కారణంగా ధరల పెంపు తప్పటంలేడని స్పష్టం చేసింది. ధరల పెంపు నిస్సాన్, డాత్సన్ రెండు బ్రాండ్ల వాహనాలపై ఉంటుందని పేర్కొంది. […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏప్రిల్ నుంచి కార్ల ధరలను పెంచనున్నట్టు దేశీయంగ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కంపెనీ నిస్సాన్ ఇండియా కూడా వచ్చే నెల నుంచి కార్ల ధరలను పెంచనున్నట్టు ప్రకటించింది. ధరల పెంపు అన్ని రకాల కార్లకు వర్తిస్తుందని, ఇన్‌పుట్ ఖర్చులు పెరిగిన కారణంగా ధరల పెంపు తప్పటంలేడని స్పష్టం చేసింది.
ధరల పెంపు నిస్సాన్, డాత్సన్ రెండు బ్రాండ్ల వాహనాలపై ఉంటుందని పేర్కొంది. ‘గత కొన్ని నెలలుగా ఇన్‌పుట్ ఖర్చులను భరిస్తూ వస్తున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో అవి మరింత భారంగా మారినందునే ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకున్నామని’ నిస్సాన్ ఇండియా ఎండీ రాకేష్ శ్రీవస్తవ చెప్పారు. అయితే, ధరల పెరుగుదల వేరియంట్‌ను బట్టి ఉంటుందని ఆయన వెల్లడించారు.