విశాఖలో ఆటో రిక్షా కార్మికుల నిరసన

దిశ, ఏపీ బ్యూరో: కరోనా లాక్​డౌన్​ కారణంగా ఇప్పటికే దెబ్బతిన్నాం. మళ్లీ ఇంత పెద్ద ఎత్తున అపరాధ రుసుమలు పెంచడం దారుణమంటూ విశాఖలో ఆటో రిక్షా కార్మికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం జీవీఎంసీ నుంచి గాంధీ విగ్రహం దాకా నిరసన ప్రదర్శన చేశారు. జీవో నంబరు 21ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. రూ. వెయ్యి నుంచి రూ. 40వేల వరకు జరిమానా విధించాలనే నిర్ణయం దుర్మార్గమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ పొట్టగొట్టే నిర్ణయాన్ని […]

Update: 2020-10-23 11:37 GMT

దిశ, ఏపీ బ్యూరో: కరోనా లాక్​డౌన్​ కారణంగా ఇప్పటికే దెబ్బతిన్నాం. మళ్లీ ఇంత పెద్ద ఎత్తున అపరాధ రుసుమలు పెంచడం దారుణమంటూ విశాఖలో ఆటో రిక్షా కార్మికులు ఆందోళనకు దిగారు. శుక్రవారం జీవీఎంసీ నుంచి గాంధీ విగ్రహం దాకా నిరసన ప్రదర్శన చేశారు. జీవో నంబరు 21ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. రూ. వెయ్యి నుంచి రూ. 40వేల వరకు జరిమానా విధించాలనే నిర్ణయం దుర్మార్గమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ పొట్టగొట్టే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News