మూడు చక్రాలు తిరిగితేనే ముద్ద
దిశ ప్రతినిధి, ఖమ్మం/మెదక్: మామూలు రోజుల్లో కార్మికులు రోజంతా ఆటో నడిపితే రూ.250 నుంచి రూ.300 మిగిలేవి కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కరోనా కారణంగా చాలా మంది ఆటో ఎక్కడం మానేశారు. ఇతరులతో కలిసి ప్రయాణించడం చాలా వరకు తగ్గిపోయింది. దీంతో ఒక్కొక్కరిగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. దీంతో ఆటో కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కనీసం ఆటో అద్దె కూడా ఎల్లడం లేదని కార్మికులు వాపోతున్నారు. లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి ఆటో […]
దిశ ప్రతినిధి, ఖమ్మం/మెదక్: మామూలు రోజుల్లో కార్మికులు రోజంతా ఆటో నడిపితే రూ.250 నుంచి రూ.300 మిగిలేవి కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కరోనా కారణంగా చాలా మంది ఆటో ఎక్కడం మానేశారు. ఇతరులతో కలిసి ప్రయాణించడం చాలా వరకు తగ్గిపోయింది. దీంతో ఒక్కొక్కరిగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. దీంతో ఆటో కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కనీసం ఆటో అద్దె కూడా ఎల్లడం లేదని కార్మికులు వాపోతున్నారు.
లాక్‌డౌన్ మొదలైన నాటి నుంచి ఆటో కార్మికులు కడుపునిండా తిన్నది లేదు.. కంటి నిండా నిద్రపోయింది లేదు. భవిష్యత్తును ఊహించుకుంటూ భయానికి లోనవుతున్నారు. లాక్‌డౌన్ పీరియడ్‌లో అయితే కేవలం దాతల సాయం మీదే ఒకపూట తిని మరో పూట కడుపు మాడ్చుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం లాక్‌డౌన్ లో ప్రభుత్వం కొన్ని సడలింపులిచ్చింది. ఆటోలో ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే ప్రయాణించాలనే నిబంధన విధించింది. దీంతో ఆటోవాలాలకు గిట్టుబాటు కావడం లేదు. దీనికి తోడు కరోనా భయానికి ప్రజలు ఇతరులతో కలిసి ప్రయాణించడం చాలా తగ్గించేశారు. దీం తో ఆటోలకు గిరాకీలు రావడం లేదు. పొ ద్దంతా ఆటో స్టాండ్ వద్ద పడిగాపులు కాస్తు న్న ప్రయాణికులు రావడం లేదు. బయటకు వచ్చిన కొద్ది మందిలో భయం భయంగానే.. ఒక్కొక్కరిని తమ గమ్య స్థానాలకు చేర్చుతున్నారు.
ఒక రోజు ఆటో నడుపుకున్నందుకు రూ. 300అద్దె చెల్లించాలి. డీజిల్ ఖర్చులు పో ను.. మిగతాది తన కష్టానికి ఫలితంగా లెక్కేసుకోవాలి. సాధారణ రోజుల్లో ఆటో నడి పితే కనీసం రూ.250 నుంచి రూ.300 వరకైనా మిగిలేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆటో అద్దె కూడా ఎల్లడం లేదని కార్మికులు వాపోతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దా దాపు 45వేల మందికి పైగా ఆటో కార్మికులున్నారు. ఖమ్మం పట్టణంలో 10వేల మం దికి పైగా ఆటోకార్మికులుండగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో 8వేలకు పైగా ఆటో కార్మికులున్నట్టు సంఘాల నాయకు లు చెబుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 10 వేల మంది ఆటో కార్మికులు ఉన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రేషన్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం 12 కిలోల బియ్యం, కుటుంబానికి రూ.1500 అందజేసింది. అయినా నిత్యవసరాలకు, అత్యవసరాలకు అప్పు చేసే పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫైనాన్స్ వడ్డీల భయం..
ఫైనాన్స్‌లో ఆటోలు కొనుగోలు చేసిన వారు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు ఇంటి ఖర్చులు, మరో వైపు ఆటో ఫైన్సాన్స్ నెలవారీ చెల్లింపుల భయంతో ఆగమవుతున్నారు. వచ్చిన డబ్బులు ఫైనాన్స్ కు సైతం కట్టేందుకు సరిపోవ డం లేదని ఇక తమ అవసరాలు ఎలా తీరుతాయని వాపోతున్నారు. పాఠశా లలు, కాలేజీలు నడవక, ప్రభుత్వ కా ర్యా లయాలు సైతం అంతంత మాత్రం గానే నడుస్తుండటంతో ఆటోలకు గిరా కీలు రావడం లేదని అంటున్నారు కార్మికులు.
రోజూ రూ.100 కూడా ఇంటికి తీసుకెళ్లలేకపోతున్నా..
ఆటో ఎక్కడానికి జనాలు భయపడుతున్నారు. అవస రమైతే నడిచి వెళ్ల డానికి కూడా సిద్ధపడు తున్నారు. రైళ్లు, స్కూళ్లు, కాలేజీలు బంద్ కావ డం, ఇతర కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలు చాలా వరకు నామమాత్రంగా నడుస్తుండటంతో ఆటోలకు గిరాకీ ఉండటం లేదు. జనాలు రోడ్ల మీదకు వచ్చినా సొంత వాహనాలనే ఎక్కువగా వాడుతున్నారు. పొద్దంతా రోడ్లపై వేచి ఉన్నా.. కనీసం రూ.100 సైతం రావడం లేదు.
– హనుమంతు గౌడ్, ఆటోడ్రైవర్, కొత్తగూడెం
పూట గడవటం లేదు
ప్రభుత్వ నిబంధనల మేరకు ఆటో నడిపితే నష్టమే తప్ప లాభం ఏమీలేదు. ప్రయాణికుల ఆటో ఎక్కాలంటే భయప డుతున్నారు. పోలీసులు ఫైన్‌లు రాస్తు న్నారు. ఫైన్లు చేల్లిస్తే మాకు ఏమీ మిగ లదు. ఈ పరిస్థితులలో ఆటో నడపలేక పక్కన పెడుతున్నాం. ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవాలి.
– ముండ్రాతి రాజు, ఆటో డ్రైవర్, సిద్దిపేట
ప్రభుత్వమే ఆదుకోవాలి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేసిన రూ.1500 సాయం చాలా మంది ఆటో కార్మికులకు అందలేదు. ప్రభు త్వం విధించిన నిబంధనతో ఆటో కా ర్మికులకు ఇబ్బందులకు గురవుతున్నా రు. దీనికి తోడు రోజురోజుకు పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలతో ఆందో ళన చెందుతున్నారు. ఏపీ ప్రభుత్వం మాదిరిగా మన ప్రభుత్వం సైతం ఆటో కార్మికులకు ఆర్థిక సాయం చేయాలి.
– కంచర్ల జమలయ్య, ఏఐటీయూసీ ఆటో వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు