దేశవాళీ మానేసైనా ఐపీఎల్ ఆడతా : స్టీవ్ స్మిత్

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అక్టోబర్, నవంబర్‌లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఐపీఎల్ నిర్వహిస్తే తాను ఆసీస్ దేశవాళీ క్రికెట్ మానేసైనా ఇండియా వస్తానని స్టీవ్ స్మిత్ చెబుతున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే జాతీయ క్రికెటర్లు తప్పనిసరిగా దేశవాళీ సీజన్‌లో ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం న్యూ సౌత్‌వేల్స్ జట్టుకు ఆడుతున్న స్మిత్, తనకు ఐపీఎల్ ముఖ్యమని, క్రికెట్ ఆస్ట్రేలియాను […]

Update: 2020-06-01 09:40 GMT

దిశ, స్పోర్ట్స్: కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అక్టోబర్, నవంబర్‌లో జరిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఐపీఎల్ నిర్వహిస్తే తాను ఆసీస్ దేశవాళీ క్రికెట్ మానేసైనా ఇండియా వస్తానని స్టీవ్ స్మిత్ చెబుతున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం ఆయా రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే జాతీయ క్రికెటర్లు తప్పనిసరిగా దేశవాళీ సీజన్‌లో ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం న్యూ సౌత్‌వేల్స్ జట్టుకు ఆడుతున్న స్మిత్, తనకు ఐపీఎల్ ముఖ్యమని, క్రికెట్ ఆస్ట్రేలియాను ఒప్పించి తప్పక ఆడతానని స్పష్టం చేశాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న స్మిత్, ఈ ఏడాది మెగా లీగ్ తప్పకుండా జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో ఆడటం వల్ల ఆస్ట్రేలియాలో జరిగే షెఫీల్డ్ షీల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే ఛాన్స్ స్మిత్ మిస్ చేసుకోనున్నాడు. ఒకవేళ స్టీవ్ స్మిత్‌కు ఐపీఎల్‌లో ఆడే అవకాశం ఇస్తే మిగతా ఆటగాళ్లకు కూడా క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. మరి స్మిత్ కోరికను బోర్డు మన్నిస్తుందా లేదా చూడాలి.

Tags:    

Similar News