మాల్దీవులకు ఆసీస్ క్రికెటర్లు

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ వాయిదా పడటంతో అన్ని దేశాల క్రికెటర్లు తమ స్వస్థలాలకు వెళ్లారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా ఆసీస్ క్రికెటర్ల ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో వారిని తొలుత శ్రీలంక పంపి అక్కడి నుంచి ఆస్ట్రేలియా చేర్చాలని బీసీసీఐ ప్రయత్నించింది. అయితే శ్రీలంక ప్రభుత్వం కూడా ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై గురువారం నిషేధం విధించింది. దీంతో ఆస్ట్రేలియన్ క్రికెటర్లను మాల్దీవులకు తరలించారు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఆస్ట్రేలియన్ […]

Update: 2021-05-06 08:22 GMT

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ వాయిదా పడటంతో అన్ని దేశాల క్రికెటర్లు తమ స్వస్థలాలకు వెళ్లారు. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా ఆసీస్ క్రికెటర్ల ప్రయాణానికి ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో వారిని తొలుత శ్రీలంక పంపి అక్కడి నుంచి ఆస్ట్రేలియా చేర్చాలని బీసీసీఐ ప్రయత్నించింది. అయితే శ్రీలంక ప్రభుత్వం కూడా ఇండియా నుంచి వచ్చే ప్రయాణికులపై గురువారం నిషేధం విధించింది. దీంతో ఆస్ట్రేలియన్ క్రికెటర్లను మాల్దీవులకు తరలించారు. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ), ఆస్ట్రేలియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఏసీఏ) ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసింది.

‘ఆస్ట్రేలియన్ క్రికెటర్లు, కోచ్‌లు, మ్యాచ్ అఫీషియల్స్, కామెంటేటర్లు అందరూ ఇండియా నుంచి మాల్దీవులకు చేరుకున్నారు. ఆస్ట్రేలియన్స్ అందరూ మాల్దీవుల్లోనే కొంత కాలం గడుపుతారు. ఇక్కడి ప్రభుత్వం కమర్షియల్స్ ఫ్లైట్స్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. మాకు సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరబోవడం లేదు. ఆంక్షలు ముగిసిన తర్వాతే వారందరూ మాల్దీవుల నుంచి ఆస్ట్రేలియా తిరిగి వస్తారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు క్షేమంగా మాల్దీవులు చేరడానికి సహకరించిన బీసీసీఐ, వారి ప్రతినిధులకు మా ధన్యవాదాలు. మైక్ హస్సీ కరోనాతో బాధపడుతున్నందున ఆయన ఇండియాలోనే ఉండనున్నారు.’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నది.

Tags:    

Similar News