బిగ్ బ్రేకింగ్.. T20 ఫైనల్‌లో ఆస్ట్రేలియా ఘన విజయం

దిశ, వెబ్‌డెస్క్ : యూఏఈ వేదికగా జరిగిన 2021 టీ20 వరల్డ్ కప్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. కంగారు జట్టు టీ20 కప్‌ను ఫస్ట్ టైం ముద్దాడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 173 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్.. మెుదటి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగింది. ఆసీస్ ఓపెనర్, కెప్టెన్ ఫించ్(5) పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. క్రీజ్‌లోకి […]

Update: 2021-11-14 11:52 GMT

దిశ, వెబ్‌డెస్క్ : యూఏఈ వేదికగా జరిగిన 2021 టీ20 వరల్డ్ కప్‌ను ఆసీస్ కైవసం చేసుకుంది. కంగారు జట్టు టీ20 కప్‌ను ఫస్ట్ టైం ముద్దాడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 173 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్.. మెుదటి ఓవర్ నుంచే ఎదురుదాడికి దిగింది.

ఆసీస్ ఓపెనర్, కెప్టెన్ ఫించ్(5) పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్‌లో ఔట్ కాగా.. క్రీజ్‌లోకి వచ్చిన మిచెల్ మార్ష్ తాను ఎదుర్కొన్న మొదటి బంతిని సిక్సర్‌ కొట్టి అటాకింగ్ బ్యాటింగ్ చేశాడు. మరో ఎండ్‌లో వార్నర్ కూడా స్పీడ్ పెంచడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలోనే అర్ధసెంచరీ చేసిన వార్నర్‌(53)ను బౌల్ట్ పెవిలియన్‌కు పంపించాడు. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజ్‌లో ఉన్న మార్ష్ ధాటిగా ఆడి (77)పరుగులు చేసి ఆస్ట్రేలియాకు కప్‌ను అందించాడు. మరో ఎండ్‌లో మ్యాక్స్‌వెల్ (28)పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ఒక్కడే రెండు వికెట్లు తీసుకోగా.. మిగిలిన బౌలర్లు ఫైనల్‌లో చేతిలెత్తేశారు.

Tags:    

Similar News