ఆసీస్ కెప్టెన్ క్రెడిట్ కార్డు చోరీ

ఆస్ట్రేలియా టెస్టు టీమ్ కెప్టెన్ టిమ్‌ పైన్‌ క్రెడిట్ కార్డు చోరీకి గురైంది. అంతేకాకుండా ఆ కార్డుతో షాపింగ్ కూడా చేసినట్లు పైన్ మీడియాకు తెలిపారు. కరోనా కారణంగా ఆస్ట్రేలియాలోనూ లాక్‌డౌన్ ప్రకటించారు. అన్ని రకాల క్రికెట్ మ్యాచులు రద్దు కావడంతో క్రికెటర్లంతా ఇండ్లకే పరిమితమయ్యారు. పైన్ కూడా కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటుండటంతో తన ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి కారు గ్యారేజీని జిమ్‌గా మార్చాలనుకున్నాడు. దీని కోసం కారును గ్యారేజీలో నుంచి బయట పెట్టి జిమ్ సామగ్రిని […]

Update: 2020-03-31 05:17 GMT
ఆసీస్ కెప్టెన్ క్రెడిట్ కార్డు చోరీ
  • whatsapp icon

ఆస్ట్రేలియా టెస్టు టీమ్ కెప్టెన్ టిమ్‌ పైన్‌ క్రెడిట్ కార్డు చోరీకి గురైంది. అంతేకాకుండా ఆ కార్డుతో షాపింగ్ కూడా చేసినట్లు పైన్ మీడియాకు తెలిపారు. కరోనా కారణంగా ఆస్ట్రేలియాలోనూ లాక్‌డౌన్ ప్రకటించారు. అన్ని రకాల క్రికెట్ మ్యాచులు రద్దు కావడంతో క్రికెటర్లంతా ఇండ్లకే పరిమితమయ్యారు. పైన్ కూడా కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటుండటంతో తన ఫిట్‌నెస్ కాపాడుకోవడానికి కారు గ్యారేజీని జిమ్‌గా మార్చాలనుకున్నాడు. దీని కోసం కారును గ్యారేజీలో నుంచి బయట పెట్టి జిమ్ సామగ్రిని అందులోకి చేర్చాడు.

కాగా, సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బయట ఉన్న కారులో నుంచి టిమ్‌ పైన్ వ్యాలెట్ చోరీ చేసి, అందులోని క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు చేశారు. ఈ ఘటనను పైన్ స్థానిక మీడియాకు వెల్లడించాడు. అంతే కాకుండా పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. కానీ క్రెడిట్ కార్డు నుంచి ఎంత మొత్తం వాడారనే విషయాన్ని మాత్రం అతను వెల్లడించలేదు.

Tags: Tim Paine, Test team Captain, Australia, Credit card, Fitness

Tags:    

Similar News