ది హండ్రెడ్ నుంచి ఆసీస్ క్రికెటర్లు ఔట్

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ది హండ్రెడ్ క్రికెట్ టోర్నీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 100 బంతుల ఫార్మాట్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీకి ఆసీస్ క్రికెటర్లు దూరమవనున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రస్తుతం కఠినమైన కోవిడ్ ఆంక్షలు విధించింది. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి 15 రోజుల కఠిన క్వారంటైన్ అమలు చేస్తున్నది. దీంతో హండ్రెడ్‌ లీగ్‌లో పాల్గొనడానికి ఇంగ్లాండ్ వెళ్తే తిరిగి వచ్చే సమయంలో 15 రోజుల పాటు […]

Update: 2021-05-23 12:03 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ది హండ్రెడ్ క్రికెట్ టోర్నీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 100 బంతుల ఫార్మాట్‌లో నిర్వహించనున్న ఈ టోర్నీకి ఆసీస్ క్రికెటర్లు దూరమవనున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రస్తుతం కఠినమైన కోవిడ్ ఆంక్షలు విధించింది. ఇతర దేశాల నుంచి వచ్చే వారికి 15 రోజుల కఠిన క్వారంటైన్ అమలు చేస్తున్నది. దీంతో హండ్రెడ్‌ లీగ్‌లో పాల్గొనడానికి ఇంగ్లాండ్ వెళ్తే తిరిగి వచ్చే సమయంలో 15 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. దీని వల్ల ఆ తర్వాత జరగబోయే వెస్టిండీస్ పర్యటనతో పాటు పలు అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. దీంతో డేవిడ్ వార్నర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆరోన్ ఫించ్ ది హండ్రెడ్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News