ఐపీఎల్‌పై వాళ్లింకా ఆశలు వదులుకోలేదు !
కరోనా మహమ్మారి కారణంగా చాలా వరకు క్రీడా ఈవెంట్లు వాయిదాపడ్డాయి. కాగా, బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఏప్రిల్ 15 వరకు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే ఈ నెల 15 తర్వాతైనా ఐపీఎల్ దాదాపు అసాధ్యమనే పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ కన్నా ముందు ఐపీఎల్ నిర్వహిస్తారనే వార్తలు వస్తున్నా.. అది అంత సులువైన పని కాదనేది పలువురి వాదన. […]
కరోనా మహమ్మారి కారణంగా చాలా వరకు క్రీడా ఈవెంట్లు వాయిదాపడ్డాయి. కాగా, బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ను ఏప్రిల్ 15 వరకు తాత్కాలికంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను గమనిస్తే ఈ నెల 15 తర్వాతైనా ఐపీఎల్ దాదాపు అసాధ్యమనే పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ కన్నా ముందు ఐపీఎల్ నిర్వహిస్తారనే వార్తలు వస్తున్నా.. అది అంత సులువైన పని కాదనేది పలువురి వాదన. ఇలా.. ఈ ఏడాది ఐపీఎల్‌కు అన్ని దారులు మూసుకుపోతుండగా, ఆస్ట్రేలియన్ క్రికెటర్లు మాత్రం ఐపీఎల్ జరుగుతందనే ఆశతో ఉండటం విశేషం.
ఈ ఐపీఎల్ సీజన్‌కు అత్యధిక విలువైన ఆటగాడిగా నిలిచిన ప్యాట్ కమిన్స్.. ఇప్పటికీ ఈ లీగ్ జరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేయగా, ప్రస్తుతం ఆ జాబితాలో స్టీవ్ స్మిత్ కూడా చేరాడు. ఐపీఎల్-13 కచ్చితంగా జరుగుతుందని, ఈ క్యాలెండర్ ఇయర్లోనే ఏదో ఒక సమయం చూసుకొని ఐపీఎల్ నిర్వహిస్తారని స్మిత్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ప్రపంచమంతా కరోనా బారిన పడిన ఈ విపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్ గురించి ఆలోచించడం సరైనది కాకున్నా.. ఐపీఎల్ ఏదో ఒక సమయంలో జరుగుతుందనే ఆశ మాత్రం ఉందన్నాడు.
Tags: Steve Smith, Pat Cummins, IPL, T20 World cup, Corona