నగలు ముట్టుకోనక్కర్లేదు!

మొన్నటికి మొన్న దక్షిణ కొరియాలోని ఒక కాస్మోటిక్స్ దుకాణంలో మేకప్ ఉత్పత్తులను ముట్టుకోకుండానే అగుమెంటెడ్ రియాలిటీ అద్దం ద్వారా పరీక్షించుకోవచ్చని మన ‘దిశ’లో చదివాం. అది చదివిన వారందరూ మనదగ్గరి దుకాణాల్లో కూడా అలాంటిది ఉంటే ఎంచక్కా మేకప్ సామాను కొనుక్కునే వాళ్లం అనుకున్నారు. అయితే మేకప్ సామాను గురించి పక్కన పెడితే ఇప్పుడు ఆషాఢ మాసం. సాధారణ సమయాల్లో అయితే పెద్ద పెద్ద వస్త్ర దుకాణాలైతే నగలు, దుస్తుల మీద ఆఫర్లు ప్రకటించేవి. వారాంతపు సాయంత్రాల్లో […]

Update: 2020-07-08 05:54 GMT

మొన్నటికి మొన్న దక్షిణ కొరియాలోని ఒక కాస్మోటిక్స్ దుకాణంలో మేకప్ ఉత్పత్తులను ముట్టుకోకుండానే అగుమెంటెడ్ రియాలిటీ అద్దం ద్వారా పరీక్షించుకోవచ్చని మన ‘దిశ’లో చదివాం. అది చదివిన వారందరూ మనదగ్గరి దుకాణాల్లో కూడా అలాంటిది ఉంటే ఎంచక్కా మేకప్ సామాను కొనుక్కునే వాళ్లం అనుకున్నారు. అయితే మేకప్ సామాను గురించి పక్కన పెడితే ఇప్పుడు ఆషాఢ మాసం. సాధారణ సమయాల్లో అయితే పెద్ద పెద్ద వస్త్ర దుకాణాలైతే నగలు, దుస్తుల మీద ఆఫర్లు ప్రకటించేవి. వారాంతపు సాయంత్రాల్లో హైదరాబాద్ ఆడవాళ్లందరూ ఆ షాపుల్లోనే ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి బాగోలేదు. అయినా షాపింగ్ చేయాలనుంది. కానీ నగలు షాపింగ్ చేస్తున్నపుడు అవి ధరించి రెండు మూడు సార్లు అద్దంలో చూసుకుని ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటేగానీ ఆడవాళ్లకు కొనాలనిపించదు. కానీ కరోనా కారణంగా ఏది ముట్టుకోవాలన్నా భయమే.. మరెలా?

స్టైల్‌డాట్‌మీ అనే స్టార్టప్ కంపెనీ దీనికో పరిష్కారాన్ని కనిపెట్టింది. ఇది అచ్చం దక్షిణ కొరియా కాస్మోటిక్స్ దుకాణం చేసిన లాంటి పరిష్కారమే. మిర్రర్ పేరుతో ఒక అగుమెంటెడ్ రియాలిటీ అద్దాన్ని రూపొందించింది. ఆభరణ విక్రయ దుకాణాలకు ఈ అద్దం చాలా ఉపయోగపడుతుంది. నగలను ముట్టుకోకుండానే అది వేసుకుంటే ఎలా కనిపిస్తారనేది ఈ అద్దంలో చూసుకున్నపుడు తెలుస్తుంది. కొవిడ్ 19 కారణంగా ప్రతి చిన్న వస్తువును శానిటైజ్ చేయాల్సి వస్తోంది. అయితే నగల వ్యాపారం చేసేవాళ్లు శానిటైజర్ ఉపయోగిస్తే నగలు వాటి మెరుగు కోల్పోయే అవకాశం ఉంది. ఈ నష్టాన్ని అధిగమించేందుకు ఈ అగుమెంటెడ్ రియాలిటీ మిర్రర్ ఉపయోగపడుతుందని స్టైల్‌డాట్‌మీ సీఈవో మేఘనా సరోగి అన్నారు.

Tags:    

Similar News