ఇన్ స్టా ప్రేమ.. వాటర్ ట్యాంక్ ఎక్కి యువకుడి హల్చల్
దిశ, పరిగి: ఇన్‌స్టా్గ్రామ్ ప్రేమ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం నాచారం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నాచారం గ్రామానికి చెందిన వినోద్(18)కు గజ్వేల్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరికి పెళ్లి చేసుకుందామని ఆ యువతిని వినోద్ స్వగ్రామమైన నాచారానికి తీసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న వినోద్ తల్లిదండ్రులు తన కొడుకు ప్రేమించిన యువతికి […]
దిశ, పరిగి: ఇన్‌స్టా్గ్రామ్ ప్రేమ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా దోమ మండలం నాచారం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. నాచారం గ్రామానికి చెందిన వినోద్(18)కు గజ్వేల్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరికి పెళ్లి చేసుకుందామని ఆ యువతిని వినోద్ స్వగ్రామమైన నాచారానికి తీసుకొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న వినోద్ తల్లిదండ్రులు తన కొడుకు ప్రేమించిన యువతికి నచ్చజెప్పి, తిరిగి గజ్వేల్‌కు పంపించారు. దీంతో తనకు ప్రేయసి దక్కదని భావించిన వినోద్ గ్రామంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి చనిపోతానని బెదిరించారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఎంత చెప్పినా.. వినకుండా దూకబోయే ప్రయత్నం చేశాడు. ఖాళీ బీర్ బాటిల్‌తో తలపై బలంగా కొట్టుకుంటూ బెదిరింపులకు గురిచేశాడు. విషయం తెలుసుకున్న దోమ ఎస్ఐ రాజు ఘటనా స్థలానికి చేరుకొని, పెళ్లి చేయిస్తానని హామీ ఇవ్వడంతో కిందకు దిగాడు. దీంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కిందకు దిగిన అనంతరం వినోద్‌ను దోమ పోలీస్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు.