యువతిపై అత్యాచారయత్నం.. అక్కడ కొరికి..
దిశ, ఏపీ బ్యూరో : అప్పు అడిగిన యువతిపై దారుణంగా ప్రవర్తించాడో కామాంధుడు. అప్పుకోసం ఇంటికి వచ్చిన యువతిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఆ యువతి ప్రతిఘటించడంతో రెచ్చిపోయాడు. కోపంతో ముఖాన్ని గోడకేసి కొట్టాడు. ఆ తర్వాత కంఠం కొరికి పరారయ్యాడు. యువతి కేకలు విన్న స్థానికులు కుటుంబ సభ్యులకు తెలపడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుడికన్ను పూర్తిగా దెబ్బతింది. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా కరపలో చోటు చేసుకుంది. ఈనెల 13న జరిగిన ఈ […]
దిశ, ఏపీ బ్యూరో : అప్పు అడిగిన యువతిపై దారుణంగా ప్రవర్తించాడో కామాంధుడు. అప్పుకోసం ఇంటికి వచ్చిన యువతిపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. ఆ యువతి ప్రతిఘటించడంతో రెచ్చిపోయాడు. కోపంతో ముఖాన్ని గోడకేసి కొట్టాడు. ఆ తర్వాత కంఠం కొరికి పరారయ్యాడు. యువతి కేకలు విన్న స్థానికులు కుటుంబ సభ్యులకు తెలపడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుడికన్ను పూర్తిగా దెబ్బతింది. ఈ దారుణ ఘటన తూర్పుగోదావరి జిల్లా కరపలో చోటు చేసుకుంది. ఈనెల 13న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కరప మండలానికి చెందిన ఓ యువతి తల్లిదండ్రులతో కలిసి స్థానికంగా దుకాణం నిర్వహిస్తోంది. ఈనెల 13న స్థానికంగా ఉండే విత్తనాల రమేష్‌ను రూ.2 వేలు అప్పు అడిగింది. కాసేపటి తరువాత రమ్మని చెప్పడంతో తెలిసిన వ్యక్తే అని వెళ్లింది. రాత్రి ఇంటికి వెళ్లిన ఆమెపై అత్యాచారయత్నానికి యత్నించగా తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో కోపోద్రిక్తుడైన రమేశ్ కోపంతో ఆమె పీక నొక్కి గోడకు అదిమి విచక్షణారహితంగా కొట్టాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఎడమ చేతిని విరిచి కంఠాన్ని కొరికాడు. చివరకు మెడ పట్టుకుని ముఖాన్ని గోడకు బలంగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆమెను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం బాధితురాలు అపస్మారకస్థితిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుడి కన్ను పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు కరప ఎస్సై డి.రమేష్‌బాబు తెలిపారు.