పెళ్లి చేసుకోవడం లేదని కూతురుపై పెట్రోల్ పోసి..
దిశ, వెబ్డెస్క్ : ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటా అన్నందుకు కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లిదండ్రులు. అడ్డుకోవాల్సిన అన్న కూడా అమ్మనాన్నతో చేతులు కలిసి చెల్లెలిని కడతేర్చాలని చూశాడు. కడప జిల్లా రాయచోటిలో మంగళవారం రాత్రి జరిగిందీ ఘటన. రాయచోటి సీఐ జి.రాజు తెలిపిన వివరాల ప్రకారం.. రాయచోటికి చెందిన యువతి గత కొన్నాళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం ఆ యువతి ఇంట్లో తెలిసి మరొకరితో వివాహం చేసేందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. […]
దిశ, వెబ్డెస్క్ : ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంటా అన్నందుకు కూతురుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు తల్లిదండ్రులు. అడ్డుకోవాల్సిన అన్న కూడా అమ్మనాన్నతో చేతులు కలిసి చెల్లెలిని కడతేర్చాలని చూశాడు. కడప జిల్లా రాయచోటిలో మంగళవారం రాత్రి జరిగిందీ ఘటన. రాయచోటి సీఐ జి.రాజు తెలిపిన వివరాల ప్రకారం..
రాయచోటికి చెందిన యువతి గత కొన్నాళ్లుగా ఓ యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయం ఆ యువతి ఇంట్లో తెలిసి మరొకరితో వివాహం చేసేందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే వచ్చిన ప్రతి సంబంధాన్నీ యువతి ఏదో ఓ కారణం చెబుతూ చెడగొడుతోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులకు, యువతికి తరచూ గొడవలు జరుగుతున్నాయి.
ప్రేమించిన యువకుడితోనే తనకు పెళ్లి చేయాలని యువతి కోరుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి యువతికి తల్లిదండ్రులకు మధ్య మరోసారి గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులతోపాటు యువతి సోదరుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆ మంటలకు తాళలేక యువతి కేకలు వేయడంతో యువతి సోదరి, స్థానికులు వచ్చి మంటలను ఆర్పివేశారు.
అనంతరం తీవ్రంగా గాయపడిన యువతిని రిమ్స్ కు తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ రాజు తెలిపారు. యువతి సోదరుడు పరారీ కావడంతో అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ చెప్పారు.