దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం : సీపీఎం

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు జరుపుతున్న దాడులను సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తక్షణమే ఈ దాడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నేతలు సీఎం పట్ల అనుచితంగా మాట్లాడి ఉంటే దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఈ రకంగా భౌతిక దాడులకు పూనుకోవడం సరికాదన్నారు. తక్షణమే సీఎం […]

Update: 2021-10-19 12:08 GMT

దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ కార్యాలయాలపై వైసీపీ కార్యకర్తలు జరుపుతున్న దాడులను సీపీఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. తక్షణమే ఈ దాడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ నేతలు సీఎం పట్ల అనుచితంగా మాట్లాడి ఉంటే దాన్ని రాజకీయంగా ఎదుర్కోవాలే తప్ప ఈ రకంగా భౌతిక దాడులకు పూనుకోవడం సరికాదన్నారు. తక్షణమే సీఎం జోక్యం చేసుకుని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని కోరారు. టీడీపీ కూడా రాజకీయ విమర్శలు హుందాగా చేయాలే తప్ప, వ్యక్తిగతం చేయడం తప్పు అని పి.మధు హితవు పలికారు.

Tags:    

Similar News