ఆస్తి తగాదా.. కత్తులతో బంధువుల దాడి

దిశ, ఏపీబ్యూరో: ఆస్తి తగాదాల విషయంలో ఓ మహిళపై సమీప బంధువులు విచక్షణా రహితంగా కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కెవీ పల్లె మండలం పాపిరెడ్డిగారి పల్లెలో సోమవారం చోటుచేసుకుంది. ప్రత్యర్థులైన సమీప బంధువులు కత్తులతో దాడికి తెగబడటంతో తులసి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే, తులసి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బంధువులు తులసిపై దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో […]

Update: 2020-08-10 05:56 GMT

దిశ, ఏపీబ్యూరో: ఆస్తి తగాదాల విషయంలో ఓ మహిళపై సమీప బంధువులు విచక్షణా రహితంగా కత్తులతో దాడికి తెగబడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కెవీ పల్లె మండలం పాపిరెడ్డిగారి పల్లెలో సోమవారం చోటుచేసుకుంది.

ప్రత్యర్థులైన సమీప బంధువులు కత్తులతో దాడికి తెగబడటంతో తులసి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే, తులసి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బంధువులు తులసిపై దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

కాగా, ఇది పథకం ప్రకారం జరిగిన దాడి అని తులసి భర్త అశోక్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ‘నన్ను నా భార్యను చంపడానికి పథకం ప్రకారమే దాడి చేశారు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News