పెద్దపల్లి ఇటుక బట్టీలో దారుణం.. భర్త కళ్లెదుటే భార్యపై ఐదుగురు అత్యాచారం

దిశ, వెబ్‌డెస్క్ : అరాచకం అంటే వారిదే. పొట్ట చేతపట్టుకొని రాష్ట్రాలు దాటి వచ్చిన వారిపై ప్రేమ చూపించాల్సిన యజమానులు విషం చిమ్మారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఐదుగురు వ్యక్తులు భార్యభర్తలపై కర్కషంగా దాడి చేశారు. అదీ చాలదన్నట్లు భర్తను బంధించి.. భార్యపై వరసగా అత్యాచారానికి పాల్పడ్డారు. వారి చేతుల్లో నలిగిపోతూ.. ఆమె చేసిన ఆర్తనాదాలు ఇటుక బట్టీల్లో సమాధి అయ్యాయి. మహిళా కార్మికురాలి పట్ల దారుణంగా వ్యవహరించిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు […]

Update: 2021-02-10 07:26 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అరాచకం అంటే వారిదే. పొట్ట చేతపట్టుకొని రాష్ట్రాలు దాటి వచ్చిన వారిపై ప్రేమ చూపించాల్సిన యజమానులు విషం చిమ్మారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఐదుగురు వ్యక్తులు భార్యభర్తలపై కర్కషంగా దాడి చేశారు. అదీ చాలదన్నట్లు భర్తను బంధించి.. భార్యపై వరసగా అత్యాచారానికి పాల్పడ్డారు. వారి చేతుల్లో నలిగిపోతూ.. ఆమె చేసిన ఆర్తనాదాలు ఇటుక బట్టీల్లో సమాధి అయ్యాయి. మహిళా కార్మికురాలి పట్ల దారుణంగా వ్యవహరించిన ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. హెచ్ఆర్‌సీ జోక్యంతో ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సమీపంలో గౌరెడ్డిపేట గ్రామం ఉన్నది. ఆ గ్రామం ఇటుక బట్టీలకు కేంద్రం. అక్కడ పని చేయించడానికి బట్టీల యజమానులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి కూలీలను తీసుకొస్తారు. అదే మాదిరిగా ఓ ఇటుక బట్టీలో పని చేయడానికి కొద్ది రోజుల క్రితం ఒడిశా నుంచి భార్యభర్తలు వచ్చారు. కూలీ కోసం వచ్చిన దంపతులకు రెండు రోజులకే నరకం కనిపించింది. రోజుకు 16 గంటల పని. కంటినిండ నిద్ర పోనివ్వరు, కడుపు నిండా తిండి ఉండదు. కనీసం చేసిన కష్టానికి తగ్గట్టుగా కూలీ ఉండదు. వెట్టి చాకిరికి నిలువుటద్దాం ఆ పని. కొద్ది రోజులు ఓపికగా పని చేసిన ఆ జంట.. రోజులు గడుస్తున్న కొద్ది ఆ చాకిరి చేయలేకపోయారు. దీంతో పని మానేసి ఒడిశా వెళ్లిపోయేందుకు రామగుండం రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు.

విషయం తెలుసుకున్న ఇటుకబట్టీ యజమాని, మరో నలుగురు అనుచరులను తీసుకోని ఆ దంపతుల జంటను మార్గమధ్యలో అడ్డుకున్నాడు. అక్కడి నుంచి వారిని కొట్టుకుంటూ ఇటుక బట్టీల వద్దకు తీసుకొచ్చి బంధించాడు. అక్కడ ఇద్దరిని తీవ్రంగా హింసించి, భర్తను తాళ్లతో కట్టేశారు. అతడి కళ్లేదుటే భార్య(22)పై పడి అత్యాచారం చేశారు. ఐదుగురు కలిసి మృగాళ్లుగా మారి ఆమెను చిత్రహింసలు పెట్టారు. వారి వాంఛను తీర్చలేక ఆమె గట్టిగా అరవడంతో సమీపంలో పని చేసే కూలీలు వచ్చారు. వారిని సైతం కామాంధులు బెదిరించారు. కళ్లెదుటే భార్యను కబలిస్తున్నా ఏం చేయలేని నిస్సహాయస్థితిలో ఉన్న భర్త కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ ఘటనను చూసిన 14 మందిని సైతం బంధించిన ఇటుకబట్టీ యజమాని.. సాక్ష్యం చెబితే ప్రాణాలు తీస్తామని హెచ్చరించడంతోపాటు వారిని ఇష్టమొచ్చినట్లు చితకొట్టారు.

ఇంత దారుణం జరిగిన ఎవరూ పట్టించుకోకపోవడంతో ఓ అజ్ఞాత వ్యక్తి జనవరి 24న మానవ హక్కుల సంఘానికి లేఖ రాశాడు. కార్మిక జంటకు, కార్మికులకు జరిగిన దారుణాన్ని ఆ లేఖలో వివరించాడు. వెంటనే స్పందించిన హెచ్ఆర్‌సీ.. ఫిబ్రవరి 8న విచారణకు ఆదేశించింది. దారుణ ఘటనపై వెంటనే విచారణ చేపట్టాలని పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్, ఎస్ఐ రాజేశ్, తహసీల్దార్ శ్రీనివాస్, సఖీ కేంద్రం అడ్మినిస్ట్రేటర్ స్వప్నకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు విచారణ చేట్టడంతో మంగళవారం ఈ విషాధ ఘటన వెలుగులోకి వచ్చింది.

Tags:    

Similar News