షహజాన్ మదర్సాలో దారుణం.. ఇద్దరు చిన్నారులపై పైశాచిక దాడి

దిశ, జల్‌పల్లి: అరబ్ భాష నేర్చుకోవడానికి మాదర్సాలో చేరిన ఇద్దరు బాలురపై, నిర్వాహకుని పిల్లలు పైశాచికంగా దాడికి పాల్పడ్డారు. గోళ్లతో గిచ్చి, కట్టెలతో విచక్షణారహితంగా వాతలు వచ్చేలా చితకబాదారు. ఈ ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… చంద్రాయణగుట్ట యాబా స్విమ్మింగ్ ఫూల్ ప్రాంతానికి చెందిన మతిన్ బిన్ జావిద్ అల్ జాబ్రి వృతి రిత్యా ప్రయివేట్ ఉద్యోగి. అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఉస్మాన్ మతిన్ అల్ జాబ్రి(8), […]

Update: 2021-08-11 11:23 GMT

దిశ, జల్‌పల్లి: అరబ్ భాష నేర్చుకోవడానికి మాదర్సాలో చేరిన ఇద్దరు బాలురపై, నిర్వాహకుని పిల్లలు పైశాచికంగా దాడికి పాల్పడ్డారు. గోళ్లతో గిచ్చి, కట్టెలతో విచక్షణారహితంగా వాతలు వచ్చేలా చితకబాదారు. ఈ ఘటన బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… చంద్రాయణగుట్ట యాబా స్విమ్మింగ్ ఫూల్ ప్రాంతానికి చెందిన మతిన్ బిన్ జావిద్ అల్ జాబ్రి వృతి రిత్యా ప్రయివేట్ ఉద్యోగి. అతనికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు ఉస్మాన్ మతిన్ అల్ జాబ్రి(8), చిన్న కొడుకు హసన్ బిబ్ మతిన్ అల్ జాబ్రి(6)లు ఉన్నారు.

అయితే.. కరోనా కారణంగా పాఠశాలలు మూసివేయడంతో ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారు. దీంతో తండ్రి మతిన్ కనీసం తన కొడుకులకు అరబ్ భాష అయినా నేర్పించాలనే తాపత్రయంతో షహజాన్ కాలనీలోని బెహరుల్ ఉలుమ్ మదర్సాలో గత 45 రోజుల క్రితం చేర్పించాడు. ఇటీవల తమ పిల్లలు ఎలా ఉన్నారో చూడటానికి అని మదర్సాకు వచ్చాడు. దీంతో తండ్రిని చూసిన పిల్లలు ఒక్కసారిగా బోరున విలపించారు. ఏమైందని ప్రశ్నించగా.. తమను మదర్సా నిర్వాహకుని పిల్లలు దారుణంగా కొట్టారని, గోళ్లతో గిచ్చి, కట్టలతో విచక్షణారహితంగా బాదారని ఏడ్చారు. ఆగ్రహానికి గురైన మతిన్ తమ పిల్లలను తీసుకొని నేరుగా బాలాపూర్ పోలీస్ స్టేషన్‌‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Tags:    

Similar News