సాయ్ కేంద్రంలో ఐదుగురు అథ్లెట్లకు కరోనా
దిశ, స్పోర్ట్స్: బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేంద్రలో శిక్షణ పొందుతున్న ఐదుగురు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు కరోనా బారిన పడ్డారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రంలో శిక్షణ కోసం వచ్చిన అథ్లెట్లకు గత శుక్రవారం పరీక్షలు నిర్వహించగా కొంత మంది కరోనా సోకినట్లు తేలింది. వీరిని వెంటనే ఐసోలేషన్‌కు పంపించి పర్యవేక్షణలో ఉంచారు. తిరిగి శుక్రవారం టెస్టులు నిర్వహించగా ఐదుగురు అథ్లెట్లు కరోనాతో ఇంకా బాధపడుతున్నట్లు తేలింది. వీరిలో నలుగురు పురుష […]
దిశ, స్పోర్ట్స్: బెంగళూరులోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) కేంద్రలో శిక్షణ పొందుతున్న ఐదుగురు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్లు కరోనా బారిన పడ్డారు. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రంలో శిక్షణ కోసం వచ్చిన అథ్లెట్లకు గత శుక్రవారం పరీక్షలు నిర్వహించగా కొంత మంది కరోనా సోకినట్లు తేలింది. వీరిని వెంటనే ఐసోలేషన్‌కు పంపించి పర్యవేక్షణలో ఉంచారు. తిరిగి శుక్రవారం టెస్టులు నిర్వహించగా ఐదుగురు అథ్లెట్లు కరోనాతో ఇంకా బాధపడుతున్నట్లు తేలింది. వీరిలో నలుగురు పురుష అథ్లెట్లు కాగా, మరో మహిళా అథ్లెట్ కూడా ఉన్నది. టోక్యో ఒలంపిక్స్ కోసం రెడీ అవుతున్న రేస్ వాకర్ ఇర్ఫాన్ కూడా కరోనా బారిన పడిన వారిలో ఉన్నారు. కాగా, అథ్లెట్లతో పాటు మరో నలుగురు సహాయక సిబ్బందికి కూడా కరోనా సోకిందని ప్రస్తుతం వారు ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది.