‘చేసింది అంతా అచ్చెన్నాయుడే’

దిశ ఏపీ బ్యూరో: ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్లలో అవకతవకల్లో నిందితుడైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రమేయంతోనే జరిగాయని ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన వాదనలు వినిపిస్తూ, ఈ నేరంలో ఆయనే ప్రధాన సూత్రధారని పేర్కొన్నారు. 2016 సెప్టెంబరు నుంచి కూడా ఆయా కంపెనీలకు అనుకూలంగా లేఖలు ఇచ్చినట్లు కోర్టుకు వెలడించారు. ఈ వివరాలన్నీ కూడా దిగువ కోర్టుకు సమర్పించామని ఆయన […]

Update: 2020-07-16 10:21 GMT

దిశ ఏపీ బ్యూరో: ఈఎస్ఐ మందులు, పరికరాల కొనుగోళ్లలో అవకతవకల్లో నిందితుడైన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రమేయంతోనే జరిగాయని ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరాం హైకోర్టు ముందు వాదనలు వినిపించారు. అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన వాదనలు వినిపిస్తూ, ఈ నేరంలో ఆయనే ప్రధాన సూత్రధారని పేర్కొన్నారు. 2016 సెప్టెంబరు నుంచి కూడా ఆయా కంపెనీలకు అనుకూలంగా లేఖలు ఇచ్చినట్లు కోర్టుకు వెలడించారు. ఈ వివరాలన్నీ కూడా దిగువ కోర్టుకు సమర్పించామని ఆయన తెలిపారు. 2016 సెప్టెంబరు 25న మంత్రి హోదాలో ఆయన నివాసంలో, ఆయన సమక్షంలో జరిగిన సమావేశం ఉద్దేశం ఏంటి? అన్నదానిని న్యాయస్థానం చూడాలని, ఆ మీటింగ్ మినిట్స్‌ను కూడా పరిశీలించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ సమావేశానికి హాజరైనవారందర్నీ అదుపులోకి తీసుకున్నామని ఆయన న్యాయస్థానానికి వివరించారు. దీంతో న్యాయస్థానం తదుపరి విచారణ వాయిదా వేసింది. వాయిదా తేదీ త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.

Tags:    

Similar News