అచ్చెన్నకు ఆరోజు.. బెయిల్ వస్తుందా?

దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్‌ఐ మందులు, పరికరాల కొనుగోళ్ల అవకతవకల్లో అరెస్టయిన మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులు వాదనలు పూర్తయ్యాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణ బుధవారానికి వాయిదా వేసి, తీర్పును రిజర్వ్‌ చేసింది. హైకోర్టులో అచ్చెన్నాయుడు బెయిల్‌ ఇవ్వాలని, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలో ఆయన పేరే లేదని, అనవసరమైన ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారని, ఏసీబీ పేర్కొన్న నివేదికలో కూడా అచ్చన్నపై నేరుగా ఆరోపణలు లేవని, ఆ కేసుతో ఆయన సంబంధం లేదని […]

Update: 2020-07-27 06:12 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఈఎస్‌ఐ మందులు, పరికరాల కొనుగోళ్ల అవకతవకల్లో అరెస్టయిన మాజీమంత్రి అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులు వాదనలు పూర్తయ్యాయి. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణ బుధవారానికి వాయిదా వేసి, తీర్పును రిజర్వ్‌ చేసింది. హైకోర్టులో అచ్చెన్నాయుడు బెయిల్‌ ఇవ్వాలని, విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదికలో ఆయన పేరే లేదని, అనవసరమైన ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశారని, ఏసీబీ పేర్కొన్న నివేదికలో కూడా అచ్చన్నపై నేరుగా ఆరోపణలు లేవని, ఆ కేసుతో ఆయన సంబంధం లేదని ఆయన తరుపు న్యాయవాదులు హైకోర్టు వాదనలు వినిపించారు. అంతేకాకుండా మంత్రిగా ఉన్నప్పుడు అనేక వినతులు వస్తాయని, వాటిని పరిశీలించి వచ్చిన వినతిపత్రాలను పార్వర్డ్ చేయడం సంప్రదాయంగా వస్తోందని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో అచ్చెన్నాయుడు పాత్రే లేనప్పుడు ఆయకు బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం బుధవారానికి కేసు వాయిదా వేసింది.

Tags:    

Similar News