శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు ఏఎస్‌క్యూ పురస్కారం

శంషాబాద్‌ ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టుకు అరుదైన పురస్కారం వరించింది. 2019 సంవత్సరానికి గాను ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏడాదికి దాదాపు రెండు కోట్ల మంది ప్రయాణించే విమానాశ్రయాల విభాగంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌కు ఏఎస్‌క్యూ పురస్కారం వరించింది. ప్రయాణికులకు భద్రతతో కూడిన మెరుగైన సేవలు అందించడం, పర్యావరణం, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ వంటి వాటికి గుర్తింపుగా ఈ అవార్డును ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబరులో పోలెండ్‌లో జరగనున్న గ్లోబల్ […]

Update: 2020-03-09 23:47 GMT

శంషాబాద్‌ ఇంటర్ నేషనల్ ఎయిర్‌పోర్టుకు అరుదైన పురస్కారం వరించింది. 2019 సంవత్సరానికి గాను ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఏడాదికి దాదాపు రెండు కోట్ల మంది ప్రయాణించే విమానాశ్రయాల విభాగంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌కు ఏఎస్‌క్యూ పురస్కారం వరించింది.
ప్రయాణికులకు భద్రతతో కూడిన మెరుగైన సేవలు అందించడం, పర్యావరణం, పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ వంటి వాటికి గుర్తింపుగా ఈ అవార్డును ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబరులో పోలెండ్‌లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌లో ఈ పురస్కార ప్రదానం జరగనుంది. విమానాశ్రయానికి ఏఎస్‌క్యూ పురస్కారం రావడంపై విమానాశ్రయ సీఈవో ఎస్‌జీకే కిషోర్ ఆనందం వ్యక్తం చేశారు.

Tags: Shamshabad Airpor, ASQ Award, Airports Council International

Tags:    

Similar News