ఏవండోయ్ శ్రీవారు నా ప్రియుడిని హగ్ చేసుకోవాలి పర్మిషన్ ఇస్తారా
దిశ,వెబ్‌డెస్క్:ప్రతీ ఒక్కరికీ గతం ఉంటుంది. గతంలో కలిసి మెలిసిన జంటలు చిన్నచిన్న మనస్పర్ధల కారణంగా విడిపోతుంటారు. మళ్లీ అదే జంట విడివిడిగా కొత్త వ్యక్తులతో జీవితాన్ని పంచుకునే సమయంలో గతం తాలుకూ చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొని చింతించకూడదు. ఇక్కడ ప్రియురాలు కూడా అలాగే చేసింది. థాయ్ లాండ్ కు చెందిన యువతి గతంలో ఓ యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో విడిపోయారు. సీన్ కట్ చేస్తే […]
దిశ,వెబ్‌డెస్క్:ప్రతీ ఒక్కరికీ గతం ఉంటుంది. గతంలో కలిసి మెలిసిన జంటలు చిన్నచిన్న మనస్పర్ధల కారణంగా విడిపోతుంటారు. మళ్లీ అదే జంట విడివిడిగా కొత్త వ్యక్తులతో జీవితాన్ని పంచుకునే సమయంలో గతం తాలుకూ చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేసుకొని చింతించకూడదు. ఇక్కడ ప్రియురాలు కూడా అలాగే చేసింది.
థాయ్ లాండ్ కు చెందిన యువతి గతంలో ఓ యువకుడిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలని అనుకుంది. కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. దీంతో విడిపోయారు. సీన్ కట్ చేస్తే ప్రియురాలు మరొకరిని వివాహం చేసుకుంది. ఆ వివాహానికి తానెంతగానో ప్రేమించిన ప్రియుణ్ని ఆహ్వానించింది. అనుకున్నట్లుగానే పెళ్లికి ప్రియుడు కూడా వచ్చాడు. పెళ్లి అనంతరం తన మాజీ ప్రియుణ్ని తన భర్తకు పరిచయం చేసేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో ప్రియుడు మరికొన్ని క్షణాల్లో మండపానికి వస్తాడనగా.. భార్య తన మాజీ ప్రియుణ్ని హగ్ చేసుకోవాలి. అందుకు పర్మీషన్ ఇస్తారా అని భర్తను అడిగింది. అందుకు భర్త ఒప్పుకున్నాడు. మండపానికి వచ్చిన ప్రియుడ్ని భర్తకు పరిచయం చేసింది. అనంతరం చివరగా తన ప్రియుడికి హగ్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.