Lockdown in Telangana : తెలంగాణలో లాక్‌డౌన్ పెట్టొద్దు: ఒవైసీ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆయన తెలంగాణ సీఎంఓకు ట్వీట్ చేశారు. కొవిడ్ 19ను ఎదుర్కోవడానికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌లో కఠినమైన నిర్ణయాలు పేదల జీవితాలను నాశనం చేస్తున్నాయని.. కొవిడ్ క్లస్టర్లలో మినీ లాక్‌డౌన్ పెట్టాలని సూచించారు. కేవలం 4 గంటల మినహాయింపు ఇస్తే పేదలు ఎలా బతుకుతారని అసదుద్దీన్ ప్రశ్నించారు. […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగింపుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం మధ్యాహ్నం కేబినెట్ సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఆయన తెలంగాణ సీఎంఓకు ట్వీట్ చేశారు. కొవిడ్ 19ను ఎదుర్కోవడానికి లాక్‌డౌన్ ఒక్కటే మార్గం కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌లో కఠినమైన నిర్ణయాలు పేదల జీవితాలను నాశనం చేస్తున్నాయని.. కొవిడ్ క్లస్టర్లలో మినీ లాక్‌డౌన్ పెట్టాలని సూచించారు. కేవలం 4 గంటల మినహాయింపు ఇస్తే పేదలు ఎలా బతుకుతారని అసదుద్దీన్ ప్రశ్నించారు. కరోనాను నివారించాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని చెప్పుకొచ్చారు.
Telganana's Cabinet will be meeting today to discuss the extension of lockdown. I must reiterate my opposition. It's not a strategy to combat COVID-19. It APPEARS as a "hard on pandemic" strategy but all it does is destroy the lives of poor. 1/5
— Asaduddin Owaisi (@asadowaisi) May 30, 2021